ACB Raids: కందుకూరు తహసీల్దార్ మహేందర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ దాడులు
ABN, First Publish Date - 2023-09-30T20:48:21+05:30
రంగారెడ్డి జిల్లా కందుకూరు తహసీల్దార్ మహేందర్‌రెడ్డి (Kandukur Tehsildar Mahender Reddy)ఇంట్లో ఏసీబీ దాడులు(ACB Raids) నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు తహసీల్దార్ మహేందర్‌రెడ్డి (Kandukur Tehsildar Mahender Reddy)ఇంట్లో ఏసీబీ దాడులు(ACB Raids) నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి హస్తినపురం షిరిడీ సాయినగర్ కాలనీలోని తన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలు రావడంతో అధికారులు రైడ్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నల్లగొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్‌గా మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. 2 కోట్ల రూపాయలు నగదు దొరికినట్లు సమాచారం.విలువైన డాక్యుమెంట్ల కోసం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Updated Date - 2023-09-30T20:48:21+05:30 IST