ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ACB Raids: రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఆర్జేడీ విజయలక్ష్మి

ABN, First Publish Date - 2023-09-21T21:57:25+05:30

రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లో ఏసీబీ దాడులు(ACB Raids) చేసింది. ఈదాడుల్లో ఆర్జేడీ విజయలక్ష్మి(RJD Vijayalakshmi) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్(ACB DSP Srikanth) మీడియాకు వివరాలు తెలిపారు.

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లో ఏసీబీ దాడులు(ACB Raids) చేసింది. ఈదాడుల్లో ఆర్జేడీ విజయలక్ష్మి(RJD Vijayalakshmi) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్(ACB DSP Srikanth) మీడియాకు వివరాలు తెలిపారు. గురువారం నాడు డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ....‘‘ ఫరూక్ నగర్ లో సీబీఎస్ఈ పాఠశాల(CBSE School) అనుమతికి శేఖర్ అనే వ్యక్తి 4 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. రంగారెడ్డి డీఈఓ కార్యాలయం నుంచి ఫైలు ఆర్జేడీ కార్యాలయానికి వచ్చింది. ఇక్కడ ఫైలు మందుకు కదలకపోవడంతో ఆర్జేడీ విజయలక్ష్మి పీఏ సతీష్‌ను సంప్రదించాడు. ఆర్జేడీ పీఏ సతీష్, ఏడీ పూర్ణచందర్రావు, సూపరింటెండెంట్ జగ్జీవన్ కలిసి 80 వేలు బాధితుడిని లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు శేఖర్ ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడు శేఖర్ నుంచి అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. ఈ రైడ్‌లో ముగ్గురిని రేపు రిమాండ్‌కు తరలిస్తాం. ఇందులో ఇంకా ఎవరికైనా వాటాలు ఉన్నాయా అనేది విచారిస్తాం. పాఠశాల అనుమతులకు సంబంధించి ఆర్జేడీ విజయలక్ష్మిని ప్రశ్నిస్తాం. ఫైలు ఇన్ని నెలలు ఎందుకు ఆపాల్సి వచ్చిందని ఆర్జేడీ విజయలక్ష్మి నుంచి వివరణ తీసుకుంటాం’’ అని ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.

Updated Date - 2023-09-21T21:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising