ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS Minister: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

ABN, First Publish Date - 2023-03-28T14:27:38+05:30

జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మేడ్చల్: జిల్లాలో మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) కి నిరసన సెగ తగిలింది. మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడలో జీవో నెంబర్ 58 లబ్దిదారులకు పట్టాల పంపిణీ సభ రసాభాసగా మారింది. కొంతమందికే పట్టాలు రావడంతో మిగిలిన వారు మంత్రిని నిలదీశారు. ఈ సందర్భంగా మంత్రి వినతిపత్రం అందించేందుకు వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పట్టాల పంపిణీ కార్యక్రమం కాస్తా తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

ఫిర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జీవో నెంబర్ 58 లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో పట్టాలపంపణి కార్యక్రమాన్ని చేపట్టారు. బోడుప్పల్‌లోని బండి గార్డెన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులందరికీ మంత్రి పట్టాల పంపిణీ చేశారు. అయితే పట్టాలు పంపిణీ చేస్తుండగా.. తమకు పట్టాలు రాలేవంటూ కొందరు ఆందోళనకు దిగారు. దీనిపై మంత్రి మల్లారెడ్డిని నిలదీయడంతో పట్టాలపంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఆ ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే పట్టాలు రాని వారికి మద్దతుగా బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. రెండు కార్పోరేషన్ పరిధిలో అనేక మంది పట్టాల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. తమకు కూడా పట్టాలు ఇప్పించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-03-28T14:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising