ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tenth paper leak: తెలంగాణలో టెన్త్ ప్రశ్నాపత్రం లీక్..

ABN, First Publish Date - 2023-04-03T13:30:08+05:30

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశ్నాపత్రాల లీకేజ్ వీడటం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వికారాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని ప్రశ్నాపత్రాల లీకేజ్ బెడద వీడటం లేదు. టీఎస్‌పీఎ‌స్పీ పేపర్ లీకేజీ (TSPSC Leakage) ఇష్యూ ముగియక ముందే తాజాగా టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజ్ (Tenth Question Paper Leakage) కలకలం రేపుతోంది.

ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్ష మొదలైన ఏడు నిమిషాలలోపే అంటే 9:37 గంటలకే ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది.

ఎంతో పకడ్బందీగా నిర్వహించవలసిన పదో తరగతి వార్షిక పరీక్షల పేపర్ తాండూరు వాట్సాప్ సోషల్ మీడియాల గ్రూప్‌లలో ముందే చెక్కర్లుకొట్టింది. తాండూర్‌లోని ఓ సెంటర్‌లో ప్రశ్నాపత్రం లీకైనట్లు సమాచారం. ఈ విషయంపై అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పేపర్ మనది కాదంటూ బుకాయించారు. అయితే పరీక్షా సమయం అయిపోయిన తర్వాత 12:30 గంటలకు బయటకు వచ్చిన విద్యార్థుల దగ్గర పేపర్ చూడగా ఆ పేపర్ ఈ పేపర్ ఒకటే విధంగా ఉన్నట్టుగా తెలిసింది. దీంతో ముందుగానే పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందని వెలుగులోకి రావడం జరిగింది. ప్రశ్నాపత్రం లీకేజ్‌తో టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రశ్నాపత్రం లీకేజ్‌పై వికారాబాద్ డీఈవో వివరణ ఇచ్చారు. తమ జిల్లాలో ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ అవలేదని చెబుతున్నారు.

Updated Date - 2023-04-03T14:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising