ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Warangal Medical Student Issue: ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే...

ABN, First Publish Date - 2023-02-23T18:58:29+05:30

వరంగల్ కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి (Preeti) ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ (Health Bulletin) విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వరంగల్ కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి (Preeti) ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ (Health Bulletin) విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు. మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రీతికి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎక్మో సపోర్టు (Ekmo support) తో చికిత్స అందిస్తున్నామని నిమ్స్ (NIMES) వైద్య బృందం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రకటించారు. వైద్యుల ప్రకటనతో ప్రీతి కుటుంబసభ్యులు, తోటి విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రీతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌(ఓటీ)లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి ప్రాణాల కోసం పోరాడుతోంది. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.

ఆసిఫ్‌ వేధింపుల వల్లే....

ఆసిఫ్‌ ఆనే విద్యార్థి వేధింపులు తట్టుకోలేకనే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. కాలేజీలో ఆసిఫ్‌ వేధింపులకు గురిచేస్తున్నాడని ప్రీతి తనతో వాపోయిందని ఆమె తండ్రి, ధారావత్‌ నరేందర్‌ తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లా నని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన సీనియర్‌ పీజీ విద్యార్థిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-02-23T20:26:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising