ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: ఉచిత విద్యుత్‌ వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న వేళ తొలిసారి స్పందించిన రేవంత్ రెడ్డి..

ABN, First Publish Date - 2023-07-11T18:11:18+05:30

కేసీఆర్ సర్కారుపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్ గురించి తానా సభలో మాట్లాడిన మాటలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన వేళ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా ట్విటర్ వేదికగా స్పందించారు.


"బీఆర్ఎస్ బీజేపీకి ‘బి’ టీం అని మరోసారి నిరూపితమైంది. రేపు రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా "సత్యాగ్రహ దీక్ష" పిలుపుని నీరుగార్చాలని, ఉచిత విద్యుత్‌పైకి దృష్టి మరల్చాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుంది. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్‌కు వెళ్లినా తెలుస్తుంది. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్. ఈ మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నాం" అని రేవంత్ రెడ్డి అన్నారు.

కాగా.. ‘‘తెలంగాణలో 95 శాతం రైతులు మూడెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు. ఒక ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు మూడు గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉంటే చాలు. టోటల్‌గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతది’ అని రేవంత్ చేసిన కామెంట్స్‌పై బీఆర్‌ఎస్ రాజకీయం మొదలైన విషయం తెలిసిందే.

Updated Date - 2023-07-11T18:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising