Komati Reddy Venkat Reddy: ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చాలి: ఎంపీ కోమటిరెడ్డి
ABN, First Publish Date - 2023-03-15T20:59:44+05:30
యాదాద్రి (Yadadri) రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)కు అవసరానికి మించి భూమి సేకరిస్తున్నారని, అలైన్‌మెంట్‌ను మార్చాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..
యాదాద్రి: యాదాద్రి (Yadadri) రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)కు అవసరానికి మించి భూమి సేకరిస్తున్నారని, అలైన్‌మెంట్‌ను మార్చాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkat Reddy) కోరారు. బుధవారం ఢిల్లీలో జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) చైర్మన్ సంతోష్‌కుమార్ యాదవ్‌తో ఎంపీ కోమటిరెడ్డి భేటీ అయ్యారు. రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణంతో పేదలకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అవసరానికి మించి భూసేకరణ చేపడుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని, ప్రైవేట్ భూముల్లో నుంచి కాకుండా, ప్రభుత్వ భూముల్లో నుంచి వెళ్లేలా అలైన్‌మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చి ప్రజల ఇబ్బందులను గుర్తించాలన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ డిజైన్ (RRR Design) ఇప్పటికీ అప్రూవల్ కాలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.500కోట్లు చెల్లించలేదని, అంతలోనే చాలామంది రైతులను రోడ్డున పడేశారని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రస్తావించానన్నారు. ఈ విషయమై ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ సానుకూలంగా స్పందించారని, అలైన్‌మెంట్ మార్పునకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు ఎంపీ వెంకటరెడ్డి ఢిల్లీలో మీడియాకు తెలిపారు.
Updated Date - 2023-03-15T21:00:59+05:30 IST