RRR Movie: జాతీయ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ హవా.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు విభాగాల్లో..
ABN, First Publish Date - 2023-08-24T18:35:10+05:30
ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా ఏ రేంజ్‌లో మోత మోగించిందో అందరికీ తెలుసు. బాక్సాఫీస్ దగ్గర నుంచి ఆస్కార్స్ దాకా.. ఎన్నో ఘనతల్ని తన ఖాతాలో వేసుకుంది. గతంలో ఏ ఇండియన్ సినిమా సాధించని ...
ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా ఏ రేంజ్‌లో మోత మోగించిందో అందరికీ తెలుసు. బాక్సాఫీస్ దగ్గర నుంచి ఆస్కార్స్ దాకా.. ఎన్నో ఘనతల్ని తన ఖాతాలో వేసుకుంది. గతంలో ఏ ఇండియన్ సినిమా సాధించని ఎన్నో రికార్డుల్ని తన పేరిట లిఖించుకుంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ దీని హవా కొనసాగుతూనే ఉంది. జపాన్ బాక్సాఫీన్‌ని ఇంకా చీల్చిచెండాడుతూనే ఉంది. ఇప్పుడు జాతీయ అవార్డుల్లోనూ ఆర్ఆర్ఆర్ తన సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు విభాగాల్లో పురస్కారాల్ని సొంతం చేసుకుంది.
ఒకసారి ఆ జాబితా చూసుకుంటే:
* బెస్ట్ కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్
* బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాల భైరవ
* బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: కీరవాణి
* బెస్ట్ యాక్షన్ డైరెక్టర్: కింగ్ సోలోమన్
* బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్
* బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడిక్ హోల్2సమ్ ఎంటర్టైన్‌మెంట్: ఆర్ఆర్ఆర్
కాగా.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా 2021 మార్చి 25వ తేదీన విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చాక ఈ చిత్రానికి గ్లోబల్‌వైడ్‌గా ప్రజాదరణ దక్కింది. ఫలితంగా.. ఎన్నో అంతర్జాతీయ వేదికలపై అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ‘నాటు నాటు’ పాట బాగా వైరల్ అవ్వడంతో, అది ఆస్కార్స్ వేదిక దాకా చేరింది. ఎట్టకేలకు కోట్లాదిమంది భారతీయుల కలని సాకారం చేస్తూ.. నాటు నాటు ఆస్కార్ అవార్డ్‌ని కైవసం చేసుకుంది. ఇప్పుడు జాతీయ అవార్డుల్లోనూ ఆరు కేటగిరీల్లో అవార్డుల పంట పండటంతో.. చిత్రబృందం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Updated Date - 2023-08-24T18:35:10+05:30 IST