RTC buses: పెరిగిన మహిళా ప్రయాణికులు.. కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు
ABN, Publish Date - Dec 14 , 2023 | 01:39 PM
మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో మణుగూరు నుంచి పలు పట్టణాలకు వెళ్లే బస్సుల్లో మహిళా ప్రయాణికుల
మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం): మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో మణుగూరు నుంచి పలు పట్టణాలకు వెళ్లే బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. గతంతోప్రత్యేక సిబ్బందిని బస్టాండ్ వద్ద డిపో అధికారులు నియమించే వారు. వారు ప్రయాణికులను ఆర్టీసీ బస్సులో ఎక్కండంటూ ప్రచారా లను నిర్వహిస్తూ ఉండేవారు. ఎంత పిలిచినా వారు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేవారు కాదు. కానీ నేడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పట్టణంలోని పలు బస్టాఫ్‌ల వద్ద బస్సులను ఎక్కేవారు. కానీ ఇప్పుడు సీట్లు దోరకడం లేదుకాబట్టి ప్రయాణికులు అంతా సురక్ష బస్టాండ్‌కు చేరుకుని ప్లాట్ ఫాంపై ఉన్న బస్సును ముందే ఎక్కి కూర్చుంటున్నారు. మహిళల సంఖ్య పెరిగిపోయే సరికి సీట్లు దొరకని పరిస్ధితులు నెలకొంటున్నాయి.
సమయ పాలన పాటించాలి
మణుగూరు నుంచి భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం(Bhadrachalam, Kothagudem, Khammam) ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులు ఉదయం సకాలంలో రావడం లేదని మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు వాపోతున్నారు. బుధవారం గంటకు పైగా బస్టాండ్‌లో ఉన్నా బస్సులు సకాలంలో రాకపోవడంతో వారు ఇబ్బందిపడ్డారు. డిపో అధికారులు ఈ విషయంపై తగిన చర్యలను తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఉచిత ప్రయాణ పథకం వల్ల బస్సులను కుదించడం సరికాదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Updated Date - Dec 14 , 2023 | 01:39 PM