ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS: కీలక పరిణామం.. కేసీఆర్‌తో శంభాజీ బ్రిగేడ్ ప్రతినిధుల భేటీ

ABN, First Publish Date - 2023-03-03T22:28:36+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌(KCR)తో మహారాష్ట్రకు చెందిన సామాజిక సేవ సంస్థ శంభాజీ బ్రిగేడ్ (Sambhaji Brigade) ప్రతినిధులు భేటీ అయ్యారు.

BRS KCR Sambhaji Brigade
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM), భారత్ రాష్ట్ర సమితి( BRS) అధినేత కేసీఆర్‌(KCR)తో మహారాష్ట్రకు చెందిన సామాజిక సేవ సంస్థ శంభాజీ బ్రిగేడ్ (Sambhaji Brigade) ప్రతినిధులు భేటీ అయ్యారు. మహారాష్ట్ర వ్యాప్తంగా బీ ఆర్ ఎస్ విస్తరణకు తమ మద్దతు ఉంటుందని కేసీఆర్‌కు చెప్పారు. ఔరంగాబాద్‌లో ఈ నెల 10న బీ ఆర్ ఎస్ మద్దతు సభ నిర్వహిస్తామని తెలియజేశారు.

భారతదేశ పురోగమనే లక్ష్యంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి పార్టీతో కలిసి పనిచేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్,మహాత్మా జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజ్, అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా మహారాష్ట్రలో నెలకొల్పబడిన ప్రగతిశీల సామాజిక సంస్థ "శంభాజీ బ్రిగేడ్" బిఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకుంది.

హైదరాబాద్ ప్రగతిభవన్ లో "శంభాజీ బ్రిగేడ్" పదాదికారులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి బిఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు తమ సమ్మతిని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమ్మతి పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వయంగా అందించి తమ నిర్ణయాన్ని తెలిపారు. దేశంలో విచ్ఛిన్నకర రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శంభాజీ బ్రిగేడ్ ఇక నుంచి బిఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుందని ఆ సంస్థ నాయకులు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ 2024 మహారాష్ట్రలో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడం పట్ల శంభాజీ బ్రిగేడ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం, పురోగమనమే లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ, శంభాజీ బ్రిగేడ్ ఒకే భావజాలం, విధానాలతో కలిసి పనిచేస్తుందని వారు ఉద్ఘాటించారు.

మహారాష్ట్రవ్యాప్తంగా ఉన్న శంభాజీ బ్రిగేడ్ కేడర్ తో పాటు 1600 మంది పదాదికారులు ( రాష్ట్ర స్థాయి నుంచి బ్లాక్ లెవల్ వరకు) ఉన్నత లక్ష్యం కోసం పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అనుమతిస్తే రానున్న రోజుల్లో చేరికలు, రాష్ట్ర పదాదికారులకు బాధ్యతల అప్పగింత పై చర్చించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-03-03T22:28:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!