ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డికి ఊరట

ABN, First Publish Date - 2023-05-08T14:48:33+05:30

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు (Delhi Liquor Scam)లో అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్‌ శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy)కి ఊరట లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు (Delhi Liquor Scam)లో అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్‌ శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy)కి ఊరట లభించింది. గతంలో శరత్ చంద్రారెడ్డికి రౌజ్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు ఆయనకు కోర్టు రెగ్యులర్ బెయిల్ (Bail) మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై శరత్ చంద్రారెడ్డికి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. గతంలో శరత్‌ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన రౌజ్‌ అవెన్యూ కోర్టు.. ఆయనకు పలు షరతులు విధించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శరత్‌ చంద్రారెడ్డి రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. భార్య చికిత్స కోసం మినహా హైదరాబాద్‌ దాటి వెళ్లకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించింది. మొబైల్‌ ఫోన్‌ ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలని, అందులో లొకేషన్‌ ఆన్‌లో పెట్టాలని పేర్కొంది. సాక్షులను బెదిరించడం, ఆధారాలను చెరిపివేయడం వంటివి చేయరాదని స్పష్టం చేసింది. ఎటువంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడవద్దని తెలిపింది. బెయిల్‌ గడువు ముగిసిన చివరిరోజు సాయంత్రంలోపు తిహార్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎదుట సరెండర్‌ కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-08T14:48:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising