ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Medico Preethi : కుక్కకు ఉన్న విలువ ఎస్టీ అమ్మాయి ప్రీతికి లేదా? మండిపడిన ఎస్సీ సెల్ చైర్మన్

ABN, First Publish Date - 2023-02-28T13:25:26+05:30

ప్రగతి భవన్‌లో కుక్క చనిపోతే అధికారులపై చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్.. కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి చనిపోతే మాత్రం ఒక్కరిపై కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో కుక్క చనిపోతే అధికారులపై చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్.. కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి చనిపోతే మాత్రం ఒక్కరిపై కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ మండిపడ్డారు. అంటే కుక్కకు ఉన్న విలువ ఎస్టీ అమ్మాయికి లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్ శవాల మీద పేలాలు ఏరుకునేలా ప్రవర్తిస్తోందన్నారు. ప్రీతి చనిపోయాక ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లుగా నాటకాలు ఆడారని ఆరోపించారు. ప్రీతిది ప్రభుత్వ హత్యేనన్నారు.

ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రీతమ్ వెల్లడించారు. ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రీతి ఇచ్చిన ట్రీట్‌మెంట్ తాలూకు పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు వారి పిల్లలు దారుణాలు చేసినా పోలీస్ చర్యలు లేవన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు ర్యాగింగ్ చేసినా చర్యలు లేవన్నారు. రాష్ర్టంలో హింస పెరుగుతోందని.. దానికి కారణం మద్యం, డ్రగ్స్ అని పేర్కొన్నారు. బండి సంజయ్ ప్రీతి ఇష్యూను మతం రంగు పులిమే ప్రయత్నం చేశారని ప్రీతమ్ విమర్శించారు.

Updated Date - 2023-02-28T13:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!