ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS MLA Victim: ఢిల్లీలో శేజల్‌ నిరవధిక దీక్ష

ABN, First Publish Date - 2023-06-19T19:06:26+05:30

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడని, పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద శేజల్‌ నిరవధిక దీక్ష చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడని, పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద శేజల్‌ నిరవధిక దీక్ష చేపట్టారు. రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయ దీక్ష చేశారు. ఎమ్మెల్యేపై కేసునమోదు చేయాలని డిమాండ్ చేశారు. దుర్గంపై చర్యలు చేసుకోవాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పట్టించుకోవడం లేదని శెజల్‌ వాపోయారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ 404లో తనపై లైంగిక దాడికి ఎమ్మెల్యే పాల్పడ్డారని, ప్రభుత్వం సీసీ పుటేజీలను బయట పెట్టి ఎమ్మెల్యే నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎమ్మెల్యే అండదండలతో సోషల్‌ మీడియాలో, వాట్సప్‌ కాల్స్‌తో తనపై యాసిడ్‌ పోసి చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యే అనుచరులు రమణ, చిల్లరపు సంతోష్‌, కుమ్మరి పోచన్న, కార్తీక్‌, భీమాగౌడ్‌, గోలి శివ, సున్నం రాజులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అరిజన్‌ డెయిరీ మీద పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడం వల్ల నష్టపోయిన బాధితులను తక్షణమే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తమకు అన్యాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. తనకు న్యాయం జరిగే వరకు నిరవధిక దీక్ష చేపడతానని శేజల్‌ పేర్కొంది.

Updated Date - 2023-06-19T19:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising