ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chigurupati Jayaram: చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

ABN, First Publish Date - 2023-03-06T17:43:58+05:30

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం (Chigurupati Jayaram) హత్య కేసులో నాంపల్లి కోర్టు (Nampally Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం (Chigurupati Jayaram) హత్య కేసులో నాంపల్లి కోర్టు (Nampally Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1 రాకేష్‌రెడ్డికి కోర్టు దోషిగా నిర్ధారించింది. మిగతా 11 మందిని ధర్మాసనం నిర్దోషులుగా తేల్చింది. అలాగే ముగ్గురు పోలీస్ అధికారులనూ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. రాకేష్‌రెడ్డికి ఈనెల 9న రాకేష్‌రెడ్డికి నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఐపీసీ 302లో రాకేష్‌రెడ్డికి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. 2019 జనవరి 31న చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాకేష్‌రెడ్డి (Rakesh Reddy), విశాల్‌, శ్రీనివాస్‌, రౌడీషీటర్‌ నగేష్‌ కీలక నిందితులుగా ఉన్నారు. జయరాం కేసులో 388 పేజీల చార్జిషీట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. అందులో 12 మంది నిందితులను చేర్చారు. అంతేకాకుండా ఈ కేసులో ముగ్గురు పోలీసు అధికారులను కూడా నిందితులుగా పేర్కొనడం గమనార్హం. రాకేష్‌రెడ్డిని 1, విశాల్‌ను ఏ2, వాచ్‌మెన్ శ్రీనివాస్‌ను ఏ3, నగేష్‌ ఏ4గా సినీ నటుడు సూర్య ప్రసాద్ ఏ5గా పోలీసులు చేర్చారు. జయరాం మేనకోడలు శిఖాచౌదరిని 11వ సాక్షిగా చార్జిషీటులో పేర్కొన్నారు. ఆమె స్నేహితుడు సంతోష్ రావును కూడా సాక్షిగా చేర్చారు. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది. నాలుగేళ్ల విచారణ తర్వాత నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది.

Updated Date - 2023-03-06T18:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising