Renuka Chaudhary : వైఎస్ జగన్ బండారం బయటపెట్టిన రేణుకా చౌదరి.. అసలేం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-03-01T17:19:33+05:30
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chaudhary) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chaudhary) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మకు జగన్ శాంతి లేకుండా చేస్తున్నారని రేణుకా చౌదరి విమర్శించారు. గతంలోనూ జగన్ పిచ్చి వేషాలు వేసేవారని, తండ్రిగా వైఎస్సార్ బయటకు రాకుండా కాపాడారని ABN ప్రత్యేక ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి చెప్పారు. బంగారం లాంటి రాష్ట్రం నాశనం అయిపోతోందని, సుప్రీంకోర్టు తీర్పులను కూడా లెక్కచేయడం లేదని రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై సుప్రీంకోర్టు ఎందుకు సుమోటోగా యాక్షన్ తీసుకోవడం లేదు? అని ఆమె అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీచేస్తానని రేణుకా చౌదరి అన్నారు. పేర్ల మార్పుతో ఎన్టీఆర్ కీర్తి తగ్గుతుందని, వైఎస్సార్ కీర్తి పెరుగుతుందనుకోవడం పొరపాటు అని రేణుకా చౌదరి తెలిపారు.
‘రాష్ట్రానికి ఫస్ట్ ఓ యూనివర్సిటీని తీసుకురండి.. అప్పుడు మీ పేరో.. మీ తాత పేరో పెట్టుకోండి’ అని జగన్‌కు రేణుకా చౌదరి సూచించారు. అమరావతి రైతులకు ఎంత అడ్డంపడితే అంతగా వారి ఉద్యమం బల పడుతుందని, ఈ ఉద్యమం ద్వారా రైతు గౌరవాన్ని పెంచారని.... రైతులకు కులం లేదని ఆమె అన్నారు. ఏ క్షణం అయినా రాజధాని రైతులు పిలిస్తే తాను వస్తానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్పినా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిపై యాక్షన్ తీసుకోవాలని లేకపోతే ప్రజలే సహాయనిరాకరణ చేస్తారని హెచ్చరించారు. చంద్రబాబు ఏదో ఒక సైబరాబాద్‌ను తయారు చేశారని.. ఆయన వల్ల అంతో ఇంతో లాభం కలిగిందని రేణుకా చౌదరి చెప్పారు.
Updated Date - 2023-03-01T20:34:35+05:30 IST