Hyderabad : తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. కొత్త రకం మత్తుకు అలవాటు పడుతున్న స్కూల్ పిల్లలు!
ABN, First Publish Date - 2023-08-04T22:58:48+05:30
హైదరాబాద్‌లోని (Hyderabad) పలు స్కూళ్ల విద్యార్థులు కొత్త రకం మత్తుకు అలవాటు పడుతున్నారు.! తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. నిపుణులు చెబుతున్నారు. స్కూల్‌కు వెళ్లే కొందరు విద్యార్థులు...
హైదరాబాద్‌లోని (Hyderabad) పలు స్కూళ్ల విద్యార్థులు కొత్త రకం మత్తుకు అలవాటు పడుతున్నారు.! తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. నిపుణులు చెబుతున్నారు. స్కూల్‌కు వెళ్లే కొందరు విద్యార్థులు ఇ- సిగరెట్లకు (E Cigarettes) అలవాటు పడుడుతున్నారు. మత్తు ఇచ్చే ఫ్లేవర్స్ వేసుకుని ఎలక్ర్టానిక్ సిగరెట్లు తాగుతున్నారని సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు (SOT Police) తేల్చారు. శుక్రవారం నాడు రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్‌లో సైబర్ ఎస్‌వోటీ ఆపరేషన్ జరిగింది. ఎలక్ట్రానిక్ సిగరెట్లు తాగుతున్న కొందరు విద్యార్థులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సబ్‌వే లాంటి చోట్ల ఇ -సిగరెట్లు తాగుతుండగా వారిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. భాగ్యనగరంలోని ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూళ్ల పక్కనే ఈ సబ్‌వేలు ఉన్నాయి. రాయదుర్గంలోని సబ్ వేపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
ఎక్కడ్నుంచి వస్తున్నాయ్!
కాగా.. నగరంలోని పలు స్కూళ్ల పరిసర ప్రాంతాల్లో ఇ-సిగరెట్లు కొనుగోలు, అమ్మకాలు జరుగుతున్నాయని గత కొన్నిరోజులుగా పెద్దఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో అలర్ట్ అయిన సైబర్ ఎస్‌వోటీ పోలీసులు రాయదుర్గం, గచ్చిబౌలిచ మాదాపూర్‌లో ఆపరేషన్ నిర్వహించారు. దీంతో విద్యార్థులు సబ్‌వేలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వార్తలు విన్న విద్యార్థులు తల్లిదండ్రులు.. స్కూల్‌కు పంపడానికి భయపడిపోతున్నారట. మరోవైపు సబ్‌వేలకు ఇ-సిగరెట్లు ఎవరు సప్లై చేస్తున్నారు..? ఎక్కడ్నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాయి..? ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు..? పాత నేరస్థులు ఏమైనా ఉన్నారా..? లేకుంటే విదేశీయులు ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సబ్‌వేలల్లో పనిచేస్తున్న పలువురు వర్కర్లు, మేనేజర్లను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు తెలియవచ్చింది.
Updated Date - 2023-08-04T22:58:48+05:30 IST