ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sankranti festival: టోల్‌గేట్ల వద్ద సాఫీగా ప్రయాణం

ABN, First Publish Date - 2023-01-12T21:29:52+05:30

సంక్రాంతి పండుగ (Sankranti festival)కు ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉపాధితో పాటు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: సంక్రాంతి పండుగ (Sankranti festival)కు ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉపాధితో పాటు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ (Hyderabad)తో పాటు పలు పట్టణాల్లో ఉంటున్న ప్రజలు పండుగను తమ పల్లెల్లో జరుపుకునేందుకు బయలుదేరారు. జాతీయ రహదారులపై గురువారం పండుగ రద్దీ నెలకొంది.

యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద మొత్తం 16గేట్లు ఉండగా, ఏపీ వైపు 11గేట్ల నుంచి, హైదరాబాద్‌ వైపు ఐదు గేట్ల మీదుగా వాహనాలను అనుమతిస్తున్నారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 35వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, వారాంతంలో ఐదు వేల వాహనాలు అదనంగా వెళుతుంటాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గురువారం 55వేల వాహనాలు రెండువైపులా రాకపోకలు సాగించాయి. టోల్‌ గేటు వద్ద ఫాస్టాగ్‌ సెన్సార్‌ సమయం మూడు సెకన్లకు గాను రెండు సెకన్లకు కుదించటంతో వచ్చిన వాహనాలు వచ్చినట్లే ముందుకు సాగాయి.

నల్లగొండ జిల్లా (Nalgonda District) కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్‌ టోల్‌గేట్‌ వద్ద మొత్తం 12గేట్లు ఉండగా, ఏపీ వైపు ఆరు గేట్లు, హైదరాబాద్‌ వైపు ఆరు గేట్ల నుంచి వాహనాల రాకపోకలు కొనసాగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 13వేల వాహనాలు, వారాంతాల్లో 20వేల వాహనాలు ఈ టోల్‌గేట్‌ మీదుగా వాహనాలు వెళతాయి. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళుతున్న నేపథ్యంలో 16 వేల వాహనాలు కొర్లపహాడ్‌ టోల్‌గేట్‌ మీదుగా వెళ్లాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలంలోని హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై గూడూరు టోల్‌ప్లాజా వద్ద మొత్తం 12గేట్లు ఉండగా, హైదరాబాద్‌ వైపు ఆరు గేట్లు, వరంగల్‌ వైపు ఆరు గేట్ల మీదుగా వాహనాల రాకపోకలు కొనసాగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 18వేల వాహనాలు, వారాంతాల్లో 21వేల వాహనాలు ఈ టోల్‌గేట్‌ మీదుగా వాహనాలు వెళతాయి. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళుతున్న నేపథ్యంలో 18వేల వాహనాలు కొర్లపహాడ్‌ టోల్‌గేట్‌ మీదుగా వెళ్లాయి.

Updated Date - 2023-01-12T21:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising