ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vinayaka Chavithi: వినాయకుడి ఆకృతిలో విద్యార్థులు.. ఆకట్టుకున్న విన్యాసం..

ABN, First Publish Date - 2023-09-17T10:40:40+05:30

వినాయక చవితి వస్తుందంటే చాలు ఊరు వాడల్లో సందడి నెలకొంటుంది. గణనాథుడి విగ్రహాలు పెట్టి చిన్నాపెద్ద సంబరాల్లో మునిగిపోతుంటారు. ఇక చిన్న పిల్లల సందడైతే మరింత ముచ్చటేస్తుంది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి ముందే సందడి నెలకొంది. మహబూబాబాద్ జిల్లా స్థానిక ఏకశిలా ఏంజెల్స్ పాఠశాలలో నిర్వహించిన ముందస్తు వినాయక చవితి వేడుకలు ఆకట్టుకున్నాయి.

మహబూబాబాద్ జిల్లా: వినాయక చవితి వస్తుందంటే చాలు ఊరు వాడల్లో సందడి నెలకొంటుంది. గణనాథుడి విగ్రహాలు పెట్టి చిన్నాపెద్ద సంబరాల్లో మునిగిపోతుంటారు. ఇక చిన్న పిల్లల సందడైతే మరింత ముచ్చటేస్తుంది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి ముందే సందడి నెలకొంది. మహబూబాబాద్ జిల్లా స్థానిక ఏకశిలా ఏంజెల్స్ పాఠశాలలో నిర్వహించిన ముందస్తు వినాయక చవితి వేడుకలు ఆకట్టుకున్నాయి. వినాయకుడి ఆకృతిలో విద్యార్థులు చేసిన విన్యాసం అందరినీ ఆకర్షించింది. ఏకశిలా ఏంజెల్ స్కూల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. విద్యార్థులు రేగడి మట్టి తెచ్చి చక్కనైన గణపతి విగ్రహాలను చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.


ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ రెడ్డి వినాయక చవితి ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇదొకటన్నారు. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారని, ప్రతి ఒక్కరూ మట్టితో వినాయక విగ్రహాన్ని తయారుచేసి పండుగను జరుపుకోవాలని సూచించారు. పిల్లలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కే.రమేష్ రెడ్డి‌తోపాటు పాఠశాల ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-09-17T10:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising