Komati Reddy: చెరుకు సుధాకర్‌ను చంపడం ఖాయం: కోమటిరెడ్డి ఆడియో వైరల్
ABN, First Publish Date - 2023-03-05T16:57:01+05:30
తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కాంగ్రెస్‌ను విమర్శించి బీజేపీలో చేరగా.. అన్న కోమటిరెడ్డి వెంటకరెడ్డి మాత్రం హస్తం పార్టీలోనే..
నల్గొండ: తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కాంగ్రెస్‌ను విమర్శించి బీజేపీలో చేరగా.. అన్న కోమటిరెడ్డి వెంటకరెడ్డి (Komatireddy Ventakareddy) మాత్రం హస్తం పార్టీలోనే ఉంటూ ఆ పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటివరకు ఆరోపణలు, విమర్శలు మాత్రమే చేసిన కోమటిరెడ్డి తాజాగా చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ (Chruku Sudhakar)ను చంపేందుకు తన అనుచరులు తిరుగుతున్నారని, వారం కంటే ఎక్కువ రోజులు బతకడం కష్టమంటూ సుధాకర్ కొడుకు సుహాస్‌కు స్వయంగా ఫోన్ చేసి హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ ఆడియో వైరల్‌గా మారింది. కోమటిరెడ్డి ఫోన్ (Phone) చేసి ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకున్నారు. ‘‘సుధాకర్‌ను చంపేందుకు వంద వెహికిల్స్‌లో తిరుగుతున్నారు. నిన్ను చంపుతారు. నీ హాస్పిటల్‌ను కూలగొడుతారు. నేను లక్షల మందిని బతికించాను. వారందరినీ నేను కంట్రోల్ చేయలేను. వాడు (చెరుకు సుధాకర్) వాడు జైల్లో పడితే నేను ఒక్కడినే పోయాను. అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. ప్రజల్లో తిరిగినా నాపై స్టేట్‌మెంట్ (Statement) ఇస్తే ఊరకోం. చంపేయడం ఖాయం’’ కోమటిరెడ్డి అల్టిమేటం జారీ చేశారు. కోమటిరెడ్డి బెదిరింపులు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సుధాకర్‌పై తీవ్ర పదజాలంతో దూషించడాన్ని తప్పుబడుతున్నారు.
దుమారం రేపుతున్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ 60 సీట్లు రావని, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అన్నారు. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కలవక తప్పదన్నారు. కాంగ్రెస్‌కు ఒంటరిగా 40-50 సీట్లు వస్తాయని తెలిపారు. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలను చెరుకు సుధాకర్ ఖండించారు. దీంతో ఆగ్రహానికి గురైన కోమటిరెడ్డి, సుహాస్‌కు ఫోన్ చేసి బెదిరించారనే ప్రచారం జరుగుతోంది. కాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ (Congress) పార్టీలో రాజకీయ దుమారం రేగుతోంది. పొత్తులపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. పార్టీకి నష్టం కలిగించేలా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ పార్టీ సీనియర్ నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేయనున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలువక తప్పదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటి మాటలు పార్టీకి నష్టమని సీనియర్ నేతలు చెబుతున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఇన్‌చార్జ్ మాణిక్‌రావు థాక్రే ఆరా తీస్తున్నారు.
Updated Date - 2023-03-05T16:57:01+05:30 IST