Talasani: మంత్రి తలసాని ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-10-22T07:10:01+05:30
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్(BRS) ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav)
బేగంపేట/సనత్‌నగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్(BRS) ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) పేర్కొన్నారు. శనివారం బేగంపేట డివిజన్ ఓల్డ్ కస్టమ్స్బస్తీ, వడ్డెరబస్తీ, బ్రాహ్మణవాడి ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ బేగంపేట నాలా వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. బేగంపేట డివిజన్లో వందల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ టి. మహేశ్వరి, నాయకులు టి. శ్రీహరి, నరేందర్, సలీంఖాన్, అక్బర్, అఖిల్, ఆరీఫ్, రాజేందర్ పాల్గొన్నారు. సనత్‌నగర్ నెహ్రూపార్క్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సరితాగౌడ్ ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన వంద మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిని తలసాని పార్టీలోకి ఆహ్వానించారు. ఓల్డ్కస్టమ్స్బస్తీలో తలసాని కుమారుడు సాయికిరణ్‌యాదవ్ ప్రచారం చేశారు.
Updated Date - 2023-10-22T07:10:01+05:30 IST