Talasani: మంత్రి తలసాని ఆసక్తికర కామెంట్స్.. దేశానికి తెలంగాణ రోల్‌మోడల్
ABN, First Publish Date - 2023-11-17T10:27:58+05:30
సనత్‌నగర్ నియోజకవ వర్గంలో ఎవరూ ఊహించని విధంగా రూ.1,400 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేసినట్లు బీఆర్‌ఎస్ సనత్‌నగర్
- మోండా డివిజన్ ప్రచారంలో తలసాని
రెజిమెంటల్‌బజార్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): సనత్‌నగర్ నియోజకవ వర్గంలో ఎవరూ ఊహించని విధంగా రూ.1,400 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేసినట్లు బీఆర్‌ఎస్ సనత్‌నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani Srinivas Yadav) అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్‌మాడల్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. గురువారం మోండా డివిజన్‌లోని బండిమెట్, జైన్‌భవన్, సజ్జన్‌లాల్ స్ట్రీట్, టకారాబస్తీ, పాట్ మార్కెట్ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ 50 ఏళ్లలో జరగని అభివృద్ధి, తెలంగాణ అవిర్భావం తరువాత తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేసి చూపించామని తెలిపారు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాగానే రూ.400 గ్యాస్ సిలిండర్, రేషన్‌పై సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. బండిమెట్, ఆదయ్యనగర్‌లలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప,నాయకులు స్కైలాబ్ యాదవ్, నాగులు, హరిక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం విజయం వైపు..
పద్మారావునగర్, (ఆంధ్రజ్యోతి): తొమ్మిదేళ్లలో బన్సి లాల్‌పేట్ డివిజన్ ప్రజల కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఎన్నికల్లో తనను గెలుపు బాటలో నడిపిస్తాయని సనత్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం బన్సిలాల్‌పేట్ డివిజన్ పరిధి భోలక్‌పూర్ లోని నర్సింహ సైకిల్ దుకాణం చౌరస్తా, ఎవర్ గ్రీన్ అసోసియేషన్, ఆరోగ్య శ్రీ సూపర్ మార్కెట్‌లోని ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదల కోసం కొనసాగిస్తున్నామని తెలిపారు. తనను అత్యధిక మెజార్టీలో గెలిపించాలని ప్రజలను కోరారు.
Updated Date - 2023-11-17T10:28:00+05:30 IST