TS Assembly Polls: మూడో జాబితాపై బీజేపీ కసరత్తు.. తెలంగాణ కోర్ కమిటీ భేటీ
ABN, First Publish Date - 2023-11-01T11:37:19+05:30
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాపై అధిష్టానం కసరత్తు చేపట్టింది.
న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాపై అధిష్టానం కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా (BJP Nationa Chief JP Nadda) నివాసంలో తెలంగాణ కోర్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah), కిషన్ రెడ్డి (Kishan Reddy), డీకే అరుణ (DK Aruna) సహా కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రేపు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంకానుంది. ఈ నేపథ్యంలో సీఈసీకి ముందు జేపీ నడ్డాతో కోర్ కమిటీ సభ్యులు మరోసారి భేటీ కానున్నారు. జనసేనకు ఇచ్చే స్థానాలు మినహా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగనుంది. అభ్యర్థుల ఎంపికపై కోర్ కమిటీ నివేదికను జేపీ నడ్డాకు కిషన్‌రెడ్డి అందించనున్నారు. రెండు రోజుల తరువాత జనసేనకు ఇచ్చే స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు 8 లేదా 9 సీట్లు బీజేపీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Updated Date - 2023-11-01T11:37:19+05:30 IST