ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gadari Kishore: హైకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు చుక్కెదురు

ABN, First Publish Date - 2023-08-28T21:34:45+05:30

తుంగతుర్తి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ ఎన్నికపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

తుంగతుర్తి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ ఎన్నికపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. గాదరి కిషోర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే అద్దంకి దయాకర్ వేసిన పిటిషన్ డిస్మిస్ చేయాలని గాదరి కిషోర్ హైకోర్టును అభ్యర్థించారు. సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఎమ్మెల్యే గాదరి కిషోర్ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. సాక్షుల లిస్ట్ ఫైల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది. అలాగే తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఎన్నికపై విచారణను హైకోర్టు సెప్టెంబరు 18కి వాయిదా వేసింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ కాసాని జ్ఞానేశ్వర్‌ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. కాగా 2018 శాసన సభ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్‌పై పద్మారావు గెలిచిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-08-28T21:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising