ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Sabitha: టెన్త్ పరీక్షలపై సబిత ట్వీట్.. ఆ రెండింటిని పక్కన పెట్టండి..

ABN, First Publish Date - 2023-04-04T16:13:05+05:30

టెన్త్ పరీక్షలపై తెలంగాణ మంత్రి సబితాఇంద్రారెడ్డి (Telangana Minister Sabitha) ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టెన్త్ పరీక్షలపై తెలంగాణ మంత్రి సబితాఇంద్రారెడ్డి (Telangana Minister Sabitha) ట్వీట్ చేశారు. పరీక్షలకు కలెక్టర్లు (Collectors), విద్య (Education), వైద్యం (Medical), పోలీస్‌ (Police), ఆర్టీసీ (RTC), పోస్టల్ అధికారులు (Postal Officers), ఉద్యోగులు (Employees) , ఉపాధ్యాయులు (Teachers) సమన్వయంతో పనిచేయాలని మంత్రి సబితా సూచించారు. విద్యార్థుల భవిష్యత్‌ (students Future) దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పనిచేయాలని, విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తే కఠినంగా వ్యవహరిస్తామని సబిత హెచ్చరించారు. చదువు విషయంలో రాజకీయ, వ్యక్తిగత స్వార్థం పక్కన పెట్టాలని సబిత అన్నారు.

మరోవైపు టెన్త్ హిందీ పేపర్ లీకేజీ (Tenth Hindi Paper Leakage)పై సీపీ రంగనాద్ (CP Ranganath) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీకేజీ అంశం మీడియాలో చూస్తేనే తెలిసిందన్నారు. ఇది లీకేజీ అనడం సరికాదని... సగం పరీక్ష అయ్యాక సోషల్ మీడియాకి వచ్చిందన్నారు. ఒక మీడియా చానల్ మాజీ రిపోర్టర్ ద్వారా సోషల్ మీడియాలో వచ్చిందని, అతనికి ఎక్కడ నుంచి వచ్చిందో తెలియాల్సి ఉందన్నారు. పరీక్ష మొదలైన గంట తర్వాత పేపర్ సోషల్ మీడియాలో వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో ఎలా వచ్చిందనేదానిపై విచారణ చేస్తున్నామని, ఇన్విజిలేటర్ ఫోన్ తీసుకెళ్లడం వల్లే పేపర్ బయటికి వచ్చిందని, సాయంత్రం కల్లా విచారణ పూర్తి చేస్తామని సీపీ రంగనాద్ స్పష్టం చేశారు.

తెలంగాణలో మరో టెన్త్ పేపర్ లీక్ అయినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. వరంగల్‌ జిల్లాలో పేపర్ లీక్ అయింది. వరుసగా రెండో రోజు టెన్త్ హిందీ పేపర్ (Hindi Paper) బయటకు వచ్చింది. మంగళవారం ఉదయం 9-30 గంటలకు హిందీ పేపర్ బయటకు వచ్చి.. వాట్సాప్ గ్రూపు (WhatsApp Group)లో చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. వరుస పేపర్ లీక్ వార్తలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది ఆకతాయిలు చేసిన పనా?.. లేక నిజంగా పేపర్ లీక్ అయిందా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం పేపర్ లీక్ అయినట్లు తమకు సమాచారం లేదని చెబుతున్నారు. అంతటా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న కూడా వికారాబాద్ జిల్లాల్లో టెన్త్ పేపర్ లీక్ అయింది.

కాగా వరుసగా రెండో రోజు పేపర్ లీకేజితో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వరంగల్ ఘటనపై డిఎస్ఈ (DSE) నుంచి ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వరంగల్ డిఈవో (DEO), ఎంఈవో (MEO)పై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన సీరియస్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్లు బయటకు వస్తున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. వరంగల్ జిల్లా ఘటనపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారుల ప్రాథమిక సమాచారం ఆధారంగా చర్యలకు పాఠశాల విద్యాశాఖ సిద్దమవుతోంది.

Updated Date - 2023-04-04T16:19:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising