ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana:10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా

ABN, First Publish Date - 2023-02-07T20:13:43+05:30

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 10 మంది అధికారులకు ప్రభుత్వం ఐఏఎస్ హోదా కల్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన 10 మంది అధికారులకు ప్రభుత్వం ఐఏఎస్ హోదా కల్పించింది. రాష్ట్ర సర్వీసు నుంచి 10 మంది అధికారులు ఐఏఎస్ హోదా సాధించారు. జల్ద అరుణశ్రీ, ఎ.నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్రియాంక, బడుగు చంద్రశేఖర్‌, కోరం అశోక్‌రెడ్డి, హరిత, వెంకట నర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్‌ నికోలస్ ఐఏఎస్కు ఎంపికయ్యారు. జనవరిలో ఢిల్లీలో రాష్ట్ర అధికారులకు యూపీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇంటర్వ్యూ ఫలితాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.

మరోవైపు తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పరిపాలన డీసీపీగా యోగేశ్, సీఐడీ ఎస్సీగా ఆర్ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. పీసీఎస్‌గా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్ డీసీపీగా రాఘవేందర్ రెడ్డి, వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీష్, వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందది. కాగా గత జనవరిలోనూ రాష్ట్రవ్యాప్తంగా 91 మంది ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది.

Updated Date - 2023-02-07T20:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising