MLC Kavitha: కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత ఏమన్నారంటే..!!
ABN, First Publish Date - 2023-02-01T16:09:48+05:30
ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు.
హైదరాబాద్: ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు. ఇది కేంద్ర బడ్జెటా లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? అని ఆమె ప్రశ్నించారు. రెండేళ్లుగా బడ్జెట్‌లో తెలంగాణకు ఏమీ కేటాయించట్లేదన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కోసం రూ.5,300 కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. ‘‘మరి కాళేశ్వరం, మిషన్ భగీరథ సంగతేంటి?, నీతి ఆయోగ్ చెప్పినా నిధులు ఎందుకు ఇవ్వడం లేదు?’’ అని కవిత ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం లబ్ధి చేకూరేలా కేంద్రం డెవలప్మెంట్ ప్రాజెక్టులను ప్రకటించిందని ఆమె వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-02-01T16:10:00+05:30 IST