Revanth Reddy: కేసీఆర్- కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
ABN, First Publish Date - 2023-03-04T21:30:41+05:30
సీఎం కేసీఆర్ (CM KCR) పై టీపీసీసీ చీఫ్ రేవంత్ (Revanth Reddy) రెడ్డి మండిపడ్డారు.
సిరిసిల్ల: సీఎం కేసీఆర్ (CM KCR) పై టీపీసీసీ చీఫ్ రేవంత్ (Revanth Reddy) రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కాపలా కుక్క కాదు.. పిచ్చి కుక్క అని విమర్శించారు. సిరిసిల్ల దయ్యాన్ని తరిమి కొడతామన్నారు. కేటీఆర్ (KTR) అనే దరిద్రుడిది తెలంగాణ (Telangana) కుటుంబం కాదన్నారు. డ్రామారావు సినిమా వాళ్ళతో తిరుగుతున్నాడని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘‘కేటీఆర్.. మాకు సమంత వద్దు, ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వద్దు’’ అని పేర్కొన్నారు. సిరిసిల్ల నేతన్నలను కేటీఆర్ అవమానించాడని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
ఇదిలావుండగా... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురైంది. అతివేగంతో వెళుతున్న కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసమవ్వగా.. పలువురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే గట్టిగా ఢీకొనడంతో రేవంత్ ప్రయాణిస్తున్న కారులోని బెలూన్లు ఓపెన్ అయ్యాయి. దీంతో రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పినట్లైంది. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన రిపోర్టర్లను సిబ్బంది వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎవరికి పెద్దగా ప్రమాదం జరగ్గపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
రేవంత్ రెడ్డి శ్రీ పాద ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండగా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
శ్రీపాద 9వ ప్యాకేజి కాలువను సందర్శించిన రేవంత్ రెడ్డి.. అసంపూర్తిగా ఉన్న కాలువను పరిశీలించారు. కాలువ పనులు పూర్తి చేయకపోవడానికి కారణాలపై అధికారులను ఫోన్ ద్వారా ప్రశ్నించారు. పనులు ఆలస్యం చేయడం ద్వారా అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంటుందని, పనుల్లో జాప్యం తగదని సూచించారు. కాలువ పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉంచారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా వారికి కాంట్రాక్టు అప్పగించారని, లాభాలు దండుకుని, మిగిలిన పనులను గాలికొదిలేశారని విమర్శించారు. పనులు ఆలస్యం కావడానికి, అంచనా వ్యయం పెరగటానికి కారణమైన సంస్థ గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Updated Date - 2023-03-04T21:30:41+05:30 IST