Sajjanar: సానియా మీర్జా యాడ్‌పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-01-31T18:42:05+05:30
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) కీలక వ్యాఖ్యలు చేశారు. క్యూనెట్ (Qnet) సంస్థపై గతంలో అనేక కేసులున్నాయన్నారు...
హైదరాబాద్: క్యూనెట్ (Qnet) లాంటి మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలకు ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేయడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక నేరాలకు సంబంధించి అనేక కేసులు ఎదుర్కొంటున్న క్యూనెట్ (Qnet) సంస్థకు సానియా మీర్జా (Sania Mirza) బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేయడం తగదని హితవు చెప్పారు. ఇలాంటి సంస్థలను ప్రోత్సహించడం వల్ల ఎంతో పటిష్టమైన మన దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసినట్టవుతుందని ఆర్టీసీ ఎండీ (Telangana RTC MD) తన తాజా ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్‌లో ఆయన సానియా మీర్జాను టాగ్ చేశారు. కొన్ని సంస్థలు ప్రముఖులతో ప్రకటనలు ఇప్పిస్తూ మోసం చేస్తున్నాయని సజ్జనార్ అన్నారు. ప్రస్తుతం క్యూనెట్ సంస్థ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని, క్యూనెట్ సంస్థకు ప్రకటనలు ఇచ్చిన అనేకమంది ప్రముఖ నటీనటులకు నోటీసులు ఇచ్చామన్నారు. కంపెనీల పేర్లను మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏబీఎన్‌తో మాట్లాడారు.
Updated Date - 2023-02-01T14:52:21+05:30 IST