Sharmila: ఓట్ల కోసమే కేసీఆర్ ప్రయత్నం: షర్మిల
ABN, First Publish Date - 2023-06-04T19:47:40+05:30
రైతులను సీఎం కేసీఆర్ (CM KCR) నిండా ముంచారని వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు.
హైదరాబాద్: రైతులను సీఎం కేసీఆర్ (CM KCR) నిండా ముంచారని వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. ఓట్ల కోసమే కేసీఆర్ 'రైతు దినోత్సవం' అని విమర్శించారు. అది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవమని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఏం సాధించారని రైతు దినోత్సవాలు? అని షర్మిల ప్రశ్నించారు. రైతులకు నేటికీ రుణమాఫీ పూర్తిగా అమలు చేయట్లేదన్నారు. పంట నష్టపరిహారానికి దిక్కులేదు, పంట బీమాకు మోక్షం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-06-04T19:47:40+05:30 IST