tenth paper leak case: ఈటల రాజేందర్‌కు నోటీసులు.. విచారణ ఎప్పుడంటే..
ABN, First Publish Date - 2023-04-06T18:14:02+05:30
టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసు (tenth paper leak case)లో నోటీసుల పరంపర కొనసాగుతోంది.
హైదరాబాద్: టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసు (tenth paper leak case)లో నోటీసుల పరంపర కొనసాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender)కు పోలీసుల నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఎమ్మెల్యే ఈటలకు ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు తెలిపారు. వరంగల్ డీసీపీ ఆఫీస్‌లో హాజరుకావాలని పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల నోటీసుపై న్యాయసలహా తీసుకునే యోచనలో ఈటల ఉన్నారు.
ఏ2 ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటలకు ఉదయం 10.41 గంటలకు పేపర్ పంపాడని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు.
మరోవైపు.. టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్ పూర్తి వివరాలను వెల్లడించారు. టెన్త్ పేపర్ లీక్ (Tenth Paper Leak) కాలేదని, కాపీయింగ్ జరిగిందని వరంగల్ సీపీ రంగనాథ్ (Warangal CP Ranganath) స్పష్టం చేశారు. తన స్నేహితులకు ఇవ్వాలని పేపర్‌ను బాలుడు ఫొటో తీసుకున్నాడని, కిటికీ పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి క్వశ్చన్ పేపర్‌ను బాలుడు తీసుకున్నాడని, తీసుకున్న ప్రశ్నాపత్రం ఫొటోను శివగణేశ్‌కు పంపాడని రంగనాథ్ తెలిపారు. శివగణేశ్ ఆ ఫొటోను టెన్త్ స్టూడెంట్స్ గ్రూప్‌లో పెట్టాడని వివరించారు. వరంగల్‌లో టెన్త్ హిందీ పేపర్ లీకైనట్లు ప్రశాంత్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టాడని, కాపీయింగ్‌లో ఓ చానల్ మాజీ ఉద్యోగి పాత్ర ఉందని రంగనాథ్ వెల్లడించారు. ప్రశాంత్ హైదరాబాద్‌లోని మీడియా ఉద్యోగికి ప్రశ్నాపత్రం పంపాడని, ఉదయం 9.30 గంటలకు ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారని, ప్రశ్నాపత్రం కాపీయింగ్ ఘటనపై సెక్షన్ 5 కింద కేసు నమోదైందని సీపీ చెప్పారు.
Updated Date - 2023-04-06T18:33:30+05:30 IST