ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Thalasani: ఏం డౌట్ లేదు.. రాష్ట్రంలో మళ్లీ అధికారం బీఆర్ఎస్‏దే..

ABN, First Publish Date - 2023-11-11T08:10:09+05:30

ఎవరు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

బేగంపేట(హైదరాబాద్): (ఆంధ్రజ్యోతి): ఎవరు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్‌(Thalasani Srinivas Yadav) స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మూడోసారి భారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్‌ సాధిస్తానన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధ్ది పనులపై తనకు పూర్తి అవగాహన ఉందని తలసాని పేర్కొన్నారు. శుక్రవారం మారేడుపల్లిలోని తన నివాసం వద్ద నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్‌లు, మైనార్టీలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌(Chief Minister KCR) నాయకత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రధానంగా డబుల్‌ బెడ్‌రూంల నిర్మాణం, దళిత బంధు, బీసీ బంధు పథకాల ద్వారా అనేకమందికి లబ్ధ్ది చేకూరిందన్నారు. డిసెంబర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మిగిలిన వారికి సైతం విడతల వారీగా ఈ పథకాలను అందజేస్తామన్నారు. సమావేశంలో ప్రశాంత్‌, జయరాజ్‌, సామేల్‌, దయాకర్‌, శ్యాంసన్‌, ముస్లిం ప్రతినిధులు ఫహీం, అఖిల్‌, ఆరీఫ్‌, మోహిన్‌, రజాక్‌, షఫీ పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు మద్దతుగా అమీర్‌పేట్‌లో మాజీ కార్పొరేటర్‌ శేషుకుమారి, డివిజన్‌ అధ్యక్షుడు హన్మంతరావు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేశారు.

Updated Date - 2023-11-11T08:10:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising