ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR: దేశం గురించి ఆలోచిస్తే భయం వేస్తోంది: కేసీఆర్

ABN, First Publish Date - 2023-06-15T18:57:58+05:30

లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తుందో ఆలోచిస్తే భయం వేస్తోందని సీఎం కేసీఆర్ (CM KCR) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ నేతలు కాదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగపూర్: లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తుందో ఆలోచిస్తే భయం వేస్తోందని సీఎం కేసీఆర్ (CM KCR) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ నేతలు కాదు.. జనం గెలవాలని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో సీఎంలు మారినా.. ప్రజల దుస్థితి అలాగే ఉందని విమర్శించారు. ఎన్నికల్లో జనం గెలిస్తే సమాజమే మారుతుందని, అందుకోసం మహారాష్ట్ర (Maharashtra)లో బీఆర్‌ఎస్ (BRS)కు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారిందని, ఎన్నికల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయిందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఔరంగాబాద్‌లో 8 రోజులకు ఒకసారి తాగునీరు వస్తోందని, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ప్రజల స్థితిగతులు మారలేదన్నారు. గంగా, యమునా డెల్టా ప్రాంతమైన ఢిల్లీలోనూ ఇదే దుస్థితి ఉందని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో (Karnataka elections) బీజేపీ ఓడిందని, కాంగ్రెస్‌ గెలిచిందని, పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఎవరు గెలిచి ఏం ప్రయోజనం? అని కేసీఆర్ ప్రశ్నించారు. దళితుల పరిస్థితులు మారనంత కాలం దేశం అభివృద్ధి చెందదన్నారు. ఒబామా అధ్యక్షుడు అయ్యాకే అమెరికా పాప ప్రక్షాళన జరిగిందని గుర్తుచేశారు. దేశంలో దళితులు, ఆదివాసీల ఉద్ధరణ జరిగి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఆలోచన తీరు మారకపోతే.. ఎన్నికలు ఎన్ని వచ్చినా మార్పురాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-15T18:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising