ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NTR: ఎన్టీఆర్ శత జయంతి వేడుకులకు పటిష్ట భద్రత

ABN, First Publish Date - 2023-05-20T12:31:37+05:30

హైదరాబాద్‌ (Hyderabad)లోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్‌ (Kaitalapur) మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్‌ (Hyderabad)లోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్‌ (Kaitalapur) మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఎన్టీఆర్ శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా శత జయంతి వేడుకులకు పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్, శాంతి భద్రతల అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తెలెత్తకుండా చర్యలు చేపట్టారు.

ముఖ్య అతిథిగా చంద్రబాబు

కైతలాపూర్‌ మైదానంలో శనివారం సాయంత్రం 5గంటలకు నిర్వహించే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) హాజరు కానున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ, వామపక్ష పార్టీల ముఖ్య నేతలు కూడా ఈ సందర్భంగా ఒకే వేదికపైకి వస్తున్నారు. వీరిలో సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు సీతారాం ఏచూరి, డీ రాజా, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ఉన్నారు. అలాగే ఎన్టీఆర్‌ శత జయంతి సభకు అగ్రశ్రేణి సినీ హీరోలు హాజరవుతున్నారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్‌గా గొప్పగుర్తింపు సాధించి, రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన 9 నెలల్లోనే అధికారం దక్కించుకొని ప్రపంచ రికార్డు సృష్టించి, అవినీతి రహిత పాలన అందించిన మహానీయుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌)కు భారతరత్న ప్రకటించాలని ప్రముఖ నటుడు మురళీమోహన్‌ డిమాండ్‌ చేశారు. శతజయంతి అయిన ఈ నెల 28వ తేదీ లోపే ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రటించాలన్నారు. కూకట్‌పల్లి ఖైతలాపూర్‌లోని కేపీహెచ్‌బీ మైదానంలో శనివారం జరగనున్న ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం పలువురు నాయకులు, నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్‌ అభిమాన సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఖైతలాపూర్‌లోని మైదానంలో జరిగే ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామికవేత్తలు, ప్రముఖ నటులు, నటీమణులు పాల్గొంటున్నారని మురళీమోహన్‌ ప్రకటించారు. ఈ ఉత్సవాలను పార్టీలకు అతీతంగా అన్నివర్గాలకు చెందినవారు విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Updated Date - 2023-05-20T12:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising