ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadri: యాదగిరిక్షేత్రంలో సంప్రదాయ పూజలు

ABN, First Publish Date - 2023-04-13T20:48:56+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy)కి గురువారం నిత్యవిధి కైంకర్యాలు సంప్రదాయరీతిలో వైభవంగా కొనసాగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy)కి గురువారం నిత్యవిధి కైంకర్యాలు సంప్రదాయరీతిలో వైభవంగా కొనసాగాయి. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన ఆచార్యులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టా అలంకారమూర్తులను వేదమంత్రోచ్ఛరణలతో పంచామృతాభిషేకం జరిపి తులసీ దళాలతో అర్చించారు. ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హోమం జరిపారు. అనంతరం గజవాహన సేవోత్సవం నిర్వహించి విశ్వక్సేనుడికి తొలిపూజలతో నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం వేళ ప్రధానాలయ ముఖమండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. కొండపైన అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరసామికి, మహామండపంలో స్పటిక మూర్తులకు నిత్యవిధి కైంకర్యాలు, నిత్య రుద్రహవన పూజలు స్మార్త సంప్రదాయరీతిలో కొనసాగాయి. స్వామికి వివిధ విభాగాల ద్వారా రూ.14,88,973 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

బంగారు కిరీటాలు, వెండి పళ్లెం అందజేత

యాదగిరీశుడికి హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన భక్తులు ఎం.సుచితప్రకాష్‌ముదిరాజ్‌ దంపతులు రూ.30లక్షల విలువైన మూడు బంగారు కిరీటాలు, వెండి పళ్లేలను కానుకగా అందజేశారు. వీరు ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం దేవస్థాన ప్రధానాలయంలో ఈవో గీతారెడ్డి, ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులకు బంగారు కిరీటాలను, వెండి పళ్లెం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ స్వామివారు తమ ఇష్టదైవమని, స్వామివారి సన్నిధిలోని ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన నిర్వహించే ఉత్సవమూర్తులకు అలంకరించేందుకు 429 గ్రాముల బరువుతో మూడు బంగారు కిరీటాలు, 520గ్రాముల బరువు గల వెండి పళ్లెంలను రూ.30లక్షలతో తయారు చేయించి అందించినట్టు తెలిపారు. దాతల కోరిక మేరకు అర్చకస్వాములు బంగారు కిరీటాలు, వెండి పళ్లెంలను శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో సంప్రోక్షణ పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులకు అలంకరించారు.

Updated Date - 2023-04-13T20:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising