ModiHyderabadVisit: ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు
ABN, First Publish Date - 2023-04-07T20:21:11+05:30
ప్రధాని మోదీ (Prime Minister Modi) పర్యటనకు పోలీసుల భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. మోదీ పర్యటనకు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: ప్రధాని మోదీ (Prime Minister Modi) పర్యటనకు పోలీసుల భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. మోదీ పర్యటనకు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీస్ సిబ్బంది సహా కేంద్ర బలగలాతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ట్రయిల్ రన్ పూర్తి చేశారు. బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Railway Station) వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. ప్రధాని పర్యటన అడ్డుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చిరించారు. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో శనివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ వేదికగా సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. రూ.720కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, బొల్లారం-మేడ్చల్, ఫలక్‌నుమా-ఉందానగర్ సెక్షన్లలో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించనున్నారు. అదే వేదికపై ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే, పోలీసు, రెవెన్యూ, ఫైర్ తదితర విభాగాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
ఉదయం 9:00 నుంచి మద్యాహ్నం 2:30 వరకు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్‌కు వచ్చే క్రమంలో చిలకలగూడ జంక్షన్ నుంచి ప్రయాణికులను అనుమతించరని పోలీసులు పేర్కొన్నారు. క్లాక్‌టవర్, పాస్‌పోర్టు ఆఫీస్, రెజిమెంటల్ బజార్ మెయిన్ రోడ్డు ద్వారా సికింద్రాబాద్ స్టేషన్ మెయిన్ ఎంట్రెన్స్‌లోకి వెళ్లాలని సూచించారు. అలాగే, పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభకు వచ్చే వాహనాలు ఆయా రూట్లలో నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కరీంనగర్ (Karimnagar)వైపు నుంచి వచ్చే వాహనాలు దోబీఘాట్, జేబీఎస్ సమీపంలోని కంటోన్మెంట్ పార్క్ వద్ద, ఆదిలాబాద్, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలు బిషన్‌పోలో గ్రౌండ్‌లో, నాగర్‌కర్నూల్, నల్లగొండ నుంచి వచ్చే వాహనాలు ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో, వరంగల్ నుంచి వచ్చే వాహనాలు ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో, మహబూబ్‌నగర్, వికారాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డు వద్ద, హైటెక్‌సిటీ, మాదాపూర్, ఎస్‌ఆర్ నగర్, పంజాగుట్ట, ట్యాంక్‌బండ్ వైపు నుంచి పరేడ్‌గ్రౌండ్‌కు వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డుకు చేరుకొని అక్కడ పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Updated Date - 2023-04-07T20:26:03+05:30 IST