ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: డేటా చోరీ కేసు సిట్‌కు బదిలీ

ABN, First Publish Date - 2023-03-23T16:01:37+05:30

డేటా (Data) చోరీ కేసు సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసును చేధించేందుకు ఐపీఎస్ అధికారితో సిట్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: డేటా (Data) చోరీ కేసు సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసును చేధించేందుకు ఐపీఎస్ అధికారితో సిట్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. కేసులో కీలకంగా ఉన్న జస్ట్ డయల్‌కు నోటీసులు ఇచ్చి విచారిస్తామని, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda), ఎస్‌బీఐ డేటా దొరికిందని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర (CP Stephen Ravindra) తెలిపారు. పలు ఆన్‌లైన్ వెబ్‌సైట్ల నుంచి డేటా చోరీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. కొంతమంది ఉద్యోగుల నుంచే వ్యక్తిగత డేటా లీక్‌ అవుతోందని తెలిపారు. నాగ్‌పూర్, ఢిల్లీ, ముంబైకి చెందిన ముఠాగా గుర్తించామని, సైబరాబాద్‌లో ఆరుగురు నిందితులు అరెస్ట్‌ చేశామని స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. డేటా చోరీ చేస్తున్న ఆరుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా కోట్ల మందికి సంబంధించిన వ్యక్తి గత డేటాను ఈ ముఠా చోరీ చేసిందన్నారు. ఆధార్, పాన్ కార్డ్, బ్యాంకు అకౌంట్‌లకు సంబంధించిన పూర్తి డేటాను ఈ ముఠా దొంగిలించిందని, పలు ఆన్ లైన్ (Online) వెబ్ సైట్ల (Web Sites) నుంచి డేటాను చోరీ చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల డేటాతో పాటు పలు బ్యాంక్‌ల క్రెడిట్ కార్డుల డేటా, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న ఆర్గనైజేషన్ల నుంచి డేటాను చోరీ చేశారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మొత్తం చోరీ చేసిన డేటాను ఈ ముఠా అధిక మొత్తంలో డబ్బుకు అమ్ముకుంటోందన్నారు. దేశ వ్యాప్తంగా చోరీకి పాల్పడ్డ నిందితులను గుర్తించామన్నారు. సైబరాబాద్ పరిధిలో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రముఖంగా నాగపూర్, ఢిల్లీ, ముంబైకి చెందిన ముఠాగా గుర్తించామన్నారు. 16.8 కోట్ల మంది దేశ పౌరుల డేటా చోరీకి గురైందని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగులకు చెందిన సెన్సిటీవ్ డేటాను సయితం అమ్మకానికి పెట్టారన్నారు. ఈ డేటా అంతా సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

Updated Date - 2023-03-23T16:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising