TS High Court: కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు ఆపాలని టీఎస్ఎల్పీఆర్బీకి ఆదేశాలు
ABN, First Publish Date - 2023-10-19T21:36:54+05:30
కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు ఆపాలని టీఎస్ఎల్పీఆర్బీకి (TSLPRB) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు ఆపాలని టీఎస్ఎల్పీఆర్బీకి (TSLPRB) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై TSLPRB జిల్లా ఎస్పీలకు, కమిషనర్లకు హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రశ్నలు తప్పుగా రావడంతో 4 మార్కులు కలపాలని హైకోర్టు కొన్ని రోజుల క్రితం ఆదేశించినా నియామక ప్రక్రియ కొనసాగుతోందని పిటిషనర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ అంశంపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు మెడికల్ టెస్టులు నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని టీఎస్ఎల్పీఆర్బీకిని హైకోర్టు ఆదేశించింది.
Updated Date - 2023-10-19T21:40:23+05:30 IST