TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై సిట్ దర్యాప్తు వేగవంతం.. కీలక ఆధారాలు సేకరణ
ABN, First Publish Date - 2023-03-22T18:39:15+05:30
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై (TSPSC Paper Leak Case) సిట్ (SIT) దర్యాప్తు వేగవంతం చేసింది.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై (TSPSC Paper Leak Case) సిట్ (SIT) దర్యాప్తు వేగవంతం చేసింది. పేపర్ లీక్ కేసులో నిందితులను సిట్ అధికారులు ఐదో రోజు విచారించారు. హిమాయత్‌నగర్ సిట్ ఆఫీస్‌లో 9 మంది నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్ నుంచి ప్రశ్నాపత్రాల లీక్పై సిట్, సైబర్ క్రైమ్ టెక్నికల్ టీమ్ ఆరా తీసింది. రాజశేఖర్ స్నేహితుడు సురేష్ గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడంతో సురేష్ను అదుపులోకి తీసుకుని విచారిచారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ కమిషన్లో పనిచేస్తూ క్వాలిఫై అయిన 10 మంది ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీ చేసింది. పలు కోణాల్లో సిట్ అధికారులు దర్యాప్తు చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు ఐదోరోజు సిట్ విచారణ ముగిసింది. 9 మంది నిందితులను సిట్ అధికారులు 7 గంటలపాటు ప్రశ్నించారు. సైబర్ క్రైమ్ టెక్నికల్ టీమ్ సాంకేతిక ఆధారాలు సేకరించింది. రేణుక, నీలేష్, గోపాల్ మధ్య రూ.14 లక్షల ఆర్ధిక లావాదేవీలపై సిట్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ కాంటాక్ట్స్, వాట్సాప్ చాటింగ్ వివరాలపై దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. రాజశేఖర్ స్నేహితుడు సురేష్ ఎవరికైనా ప్రశ్నాపత్రం లీక్ చేశాడా?.. అనే కోణంలో సురేష్ను విచారించారు. సురేష్, రాజశేఖర్ లావాదేవీలు, వాట్సాప్, కాల్ డేటాపై సిట్ అధికారులు ప్రశ్నించారు.
Updated Date - 2023-03-22T18:42:25+05:30 IST