ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tummala: మాజీమంత్రి తుమ్మల హాట్ కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-09-03T12:15:53+05:30

జనం కోసం.. జలం కోసమే తన రాజకీయ జీవితమని, సీతారామా ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేయటమే తన రాజకీయ

- జనం కోసం, జలం కోసమే నా రాజకీయం

- అవినీతి రాజకీయాలు తాత్కాలికమే..

- అభివృద్ధి రాజకీయాలే శాశ్వతం

- మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం: జనం కోసం.. జలం కోసమే తన రాజకీయ జీవితమని, సీతారామా ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేయటమే తన రాజకీయ లక్ష్యమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Former Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. శనివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ... అభివృద్ధి రాజకీయాలే ప్రజల్లో శాశ్వితంగా ఉంటాయన్నారు. అవినీతి రాజకీయాలు తత్కాలికమేనన్నారు. మంత్రిగా ఉమ్మడి జిల్లాలో గిరిజన ప్రాంతం నుంచి మైదాన ప్రాంతం వరకు ఆహర్నిశలు శ్రమించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని మారుమూల మన్యంలో కూడా అభివృద్ధి వెలుగులు నింపానని గుర్తు చేసుకున్నారు. వాజేడు మండలంలో లొట్టిపిట్టి గండిపై వారధి నిర్మాణం పూర్తి చేసి రెండు రాష్ట్రాలకు రహదారులు ఆనాడు అనుసంధానం చేశానన్నారు. అలాగే మారుమూల వాజేడు మండలంలో అనేక వంతెనలు నిర్మించానన్నారు.

కూనవరం-వీఆర్‌ పురం(Kunavaram-VR Puram) వద్ద శబరిపై బ్రిడ్జి నిర్మాణం చేశానని, నక్సల్‌ ప్రభావిత మారుమూల గుండాల, వేలేరుపాడు(Gundala, Velerupadu) మండలాల్లో కూడు అభివృద్ధి పరుగులు పెట్టించాని గుర్తు చేశారు. అదే స్పూర్తితో తన చిరకాల వాంఛ అయిన సీతారామా ప్రాజెక్టు(Sitarama project) పూర్తి చేయించి గోదావరి జలాలను ఉమ్మడి జిల్లాలోని భూముల్లో పారించి కల్లారా చూసిన తర్వాతనే అదే వేదికపై రాజకీయాల నుంచి తప్పుకుంటానని తుమ్మల పేర్కొన్నారు. పీవీ నర్సింహారావు ప్రధాన మంత్రిగా ఉన్ననాటి నుంచి గోదావరి జలాలను దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా తరలించి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని ప్రయత్నించానని, టీడీపీ హాయంలో మంత్రిగా దుమ్ముగూడెం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి టెండర్‌ దశలో పార్టీ ఓటమి కారణంగా ప్రాజెక్టు ప్రారంభించలేకపోయామని తెలిపారు.

Updated Date - 2023-09-03T12:15:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising