ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Naveen murder case: నవీన్ హత్య కేసులో మరో ట్వీస్ట్

ABN, First Publish Date - 2023-02-25T19:46:29+05:30

అక్క, బావలతో నివాసం ఉంటున్న హరిహరకృష్ణ నవీన్ను హత్య చేసిన తరువాత ఇంటికి రాలేదని తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: అబ్దుల్లాపూర్మెట్ నవీన్ హత్య కేసు (Naveen murder case)లో మరో ట్విస్ట్ మొదలైంది. నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను అరెస్ట్ చేసి హయత్నగర్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితుడు హరిహరకృష్ణకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. హరిహరకృష్ణను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. మూసారంబాగ్లో అక్క, బావలతో నివాసం ఉంటున్న హరిహరకృష్ణ నవీన్ను హత్య చేసిన తరువాత ఇంటికి రాలేదని తెలుస్తోంది. మలక్పేట్ పీఎస్లో ఈనెల 23న హరిహరకృష్ణపై మిస్సింగ్ కేసు నమోదైంది. హరిహరకృష్ణ కనిపించడం లేదంటూ హరిహరకృష్ణ బావ లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజే అబ్దుల్లాపూర్మెట్ పీఎస్లో హరిహరకృష్ణ లొంగిపోవడంతో మరో ట్విస్ట్‌కు దారితీసింది.

గెట్ టు గెదర్ పేరుతో పిలిచి తన కుమారుడిని చంపారని నవీన్ తల్లిదండ్రులు వాపోతున్నారు. తన కుమారుడిని చంపిన వాడిన శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నవీన్కు హరిహరకృష్ణ స్నేహితుడని తమకు తెలియదన్నారు. హరిహరకృష్ణ పద్ధతి నచ్చక అమ్మాయి దూరమైందని నవీన్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఆ అమ్మాయికు నవీన్ స్నేహితుడు మాత్రమేనన్నారు. అమ్మాయి క్లోజ్గా ఉంటుందనే నవీన్ను చంపారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నవీన్ హత్యలో అమ్మాయి ప్రమేయం ఉందో లేదో తెలియదన్నారు.

కాగా నల్గొండ ఎంజీ యూనివర్సిటీకి చెందిన నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ సాయి పేర్కొన్నారు. ఇప్పటికే నిందితుడు హరిహరకృష్ణను అరెస్ట్ చేశామన్నారు. సాంకేతిక ఆధారాలతో కేసును విచారణ చేస్తున్నామన్నారు. హత్యలో ఎవరెవరు పాల్గొన్నారనేది తేలాల్సి ఉందని తెలిపారు. ఇది ఒక పథకం ప్రకారం చేసిన హత్య గా కనిపిస్తోందన్నారు. నవీన్ ను అతి కిరాతకంగా నిందితుడు హరిహరకృష్ణ పొడిచి చంపేశాడు. ఇందులో అమ్మాయి పాత్ర ఎంత వరకు ఉందో విచారిస్తున్నామన్నారు. నవీన్ , హరిహరకృష్ణ ఇద్దరూ మంచి స్నేహితులన్నారు. తమ కన్న కొడుకులా చూసుకున్న హరిహరకృష్ణ తమ కుమారుడిని ఇంత దారుణంగా హతమారుస్తాడని భావించలేదని నవీన్ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

అసలేం జరిగిందంటే.. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నవీన్, హరిహర అనే ఇద్దరు యువకులు చదువుతున్నారు. అదే యూనివర్సిటీలో చదువుతున్న యువతిని వీరిద్దరూ ప్రేమించారు. అయితే హరిహరకు మాత్రం తన ప్రియురాలు తనకు దక్కదేమోనన్న అనుమానం కలిగింది. ఆమె నవీన్‌తో క్లోజ్‌గా ఉండటంతో అతనిపై కక్ష కట్టాడు. ఈ నెల 17వ తేదీన నవీన్‌ను పార్టీ పేరుతో హైదరాబాద్ శివారు ప్రాంతానికి పిలిచాడు. ఆపై అతడిని హత్య చేసి గుట్టలో పడేసి హరిహర అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కుమారుడు కనిపించకపోవడం.. అతని ఫోన్ కూడా పనిచేయకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు నివ్వెరబోయే విషయాలు తెలిశాయి. నవీన్ మృతి దేహాన్ని హైదరాబాద్ శివారులో పోలీస్ అధికారులు గుర్తించారు. నవీన్ మృతదేహాన్ని రికవరీ చేసుకొని పోస్టుమార్టానికి తరలించారు. తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకుండా పోతుందనే బాధతో నవీన్ హత్యకు హరిహర ప్లాన్ చేశాడని విచారణలో తేలింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌పై పయ్యావుల కేశవ్‌ హాట్‌కామెంట్స్..

Updated Date - 2023-02-25T20:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising