ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: జగిత్యాల బంద్‌కు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ పిలుపు

ABN, First Publish Date - 2023-05-12T19:28:41+05:30

జగిత్యాల జిల్లా (Jagtial District) జగిత్యాల రూరల్‌ ఎస్సై అనిల్‌ సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని కోరుతూ శనివారం జిల్లా కేంద్రం బంద్‌కు విశ్వహిందూ పరిషత్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: జగిత్యాల జిల్లా (Jagtial District) జగిత్యాల రూరల్‌ ఎస్సై అనిల్‌ సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని కోరుతూ శనివారం జిల్లా కేంద్రం బంద్‌కు విశ్వహిందూ పరిషత్‌ (Vishva Hindu Parishad), భజరంగ్‌దళ్‌ నాయకులు పిలుపునిచ్చారు. బంద్‌కు సంబంధించి నాయకులు ప్రత్యేక కరపత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఆర్టీసీ బస్సులో బలహీనవర్గానికి చెందిన ఒక హిందూ మహిళ మీద దాడి చేసి, దానికి మతం రంగు పులుముతూ, ఆ మహిళ భర్త అయిన ఎస్సై మీద ఎంఐఎం పార్టీ కక్ష సాధింపులకు నిరసనగా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వారు కరపత్రంలో పేర్కొనారు. ఆర్టీసీ బస్సులో జరిగిన ఘటనలో ఒక వర్గం వారి ఆరోపణలు మాత్రమే పరిగణనలోకి తీసుకుని బస్సు డ్రైవర్‌, కండక్టర్‌, తోటి ప్రయాణికులను విచారించకుండా ఒక వర్గం వారి ఒత్తిళ్లకు, ఎంఐఎం (MIM) బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు బయపడి ఎస్సైని సస్పెండ్‌ చేయడం తగదన్నారు. వెంటనే సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ జగిత్యాల శాఖ నాయకులు ప్రత్యేక కరపత్రాన్ని విడుదల చేశారు. అయితే ఈ కరపత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా పలువురు తమ సెల్‌ ఫోన్లలో ఉన్న వాట్సాఫ్‌ స్టేటల్‌లో పెట్టి ఎస్సైకి మద్దతు పలుకుతున్నారు.

Updated Date - 2023-05-12T19:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising