ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS: మళ్లీ విజయం మనదే: సీఎం కేసీఆర్ ధీమా

ABN, First Publish Date - 2023-10-15T12:43:48+05:30

బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ (CM KCR) కీలక సూచనలు చేశారు. మళ్లీ విజయం మనదేనని, ఎవరూ తొందరపడొద్దని అభ్యర్థులతో అన్నారు. మొట్టమొదటిగా పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారిని బుజ్జగించాలని సూచించారు. చిన్న కార్తకర్త అయినా అలిగితే వారి ఇంటికెళ్లి మాట్లాడాలని కోరారు. అహంకారానికిపోతే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ (CM KCR) కీలక సూచనలు చేశారు. మళ్లీ విజయం మనదేనని, ఎవరూ తొందరపడొద్దని అభ్యర్థులతో అన్నారు. మొట్టమొదటిగా పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారిని బుజ్జగించాలని సూచించారు. చిన్న కార్తకర్త అయినా అలిగితే వారి ఇంటికెళ్లి మాట్లాడాలని కోరారు. అహంకారానికిపోతే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రతి కార్యకర్తతో నేతలు మాట్లాడాలని సూచించారు. కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని, వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదు. కానీ న్యాయపరమైన అంశాల వల్ల మార్చాల్సి వచ్చిందన్నారు. మార్పులు, చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగాయని కేసీఆర్‌ అన్నారు. ఎన్నికల వేళ కొన్ని కోపతాపాలు ఉంటాయి.. సహజమేనని, ఎన్నికల వేళ అభ్యర్థులకు ఓపిక, సంయమనం ఉండాలని హెచ్చరించారు. అందరూ నాయకులను కలుపుకుని పోవాలన్నారు.


సామరస్యంగా సీట్ల సర్దుబాటు...

ఇక.. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. వేములవాడలో న్యాయమైన ఇబ్బందులతోనే అభ్యర్థిని మార్చినట్టు చెప్పారు. మరోవైపు ప్రజల్లో గెలిచినా సాంకేతిక అంశాలతో దెబ్బతీయాలని కుట్రచేస్తారని బీ-ఫామ్స్ నింపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి విషయంపై క్లారిటీతో ఉండాలని సూచించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, వనమా శ్రీనివాస్ రావు కోర్టుల్లో ఎదుర్కొంటున్న పరిస్థితులే ఇందుకు ఉదాహరణ అని సూచించారు. దరఖాస్తు నింపే సమయంలో అడ్వకేట్ల సహాయం తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ ఫోన్ నంబర్‌ను ఇచ్చారు. ఇక ఆదివారానికి 51 బీ-ఫామ్స్ మాత్రమే సిద్ధమయ్యాయని, మిగతావి రెడీ అవుతాయని తెలిపారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసిన అనంతరం 12.15 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడడం మొదలుపెట్టరు. కాగా లంచ్ తర్వాత బీఆర్ఎస్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్‌ విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.

Updated Date - 2023-10-15T12:47:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising