ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijaya Reddy: ఖైరతాబాద్‌ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-11-09T08:04:20+05:30

పీజేఆర్‌ హయాంలో ఖైరతాబాద్‌(Khairatabad) కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉండేదని, దానిని పునరావృతం చేసి మరోసారి

ఖైరతాబాద్‌, (ఆంధ్రజ్యోతి): పీజేఆర్‌ హయాంలో ఖైరతాబాద్‌(Khairatabad) కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉండేదని, దానిని పునరావృతం చేసి మరోసారి కాంగ్రెస్‌ జెండాను ఎగురవేస్తానని ఆ పార్టీ అభ్యర్థి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి విజయారెడ్డి(Vijaya Reddy) అన్నారు. ఖైతరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది యువకులు విజయారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రె్‌స పార్టీలో చేరారు. గ్రంథాలయ చౌరస్తాలో ఉన్న దివంగత పీజేఆర్‌ విగ్రహం వద్ద పూజలు చేసిన విజయారెడ్డితోపాటు స్థానిక నేత వికేష్‌ ఆధ్వర్యంలో యువత భారీ గజమాలను క్రేన్‌ సహాయంతో అందజేశారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్కరికీ అండదండగా ఉంటానని అన్నారు. అందరం మరో 20 రోజులు కష్టపడి ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. వికేష్‌, పప్పు, కార్తీక్‌, రాజశేఖర్‌, భగత్‌, ఆశిష్‌, చిన్న, శ్రీకాంత్‌, నాను, వెంకట్‌, రాకేష్‌, విజయ్‌లతోపాటు 200 మంది యువకులు, 100 మంది మహిళలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

నేడు నామినేషన్‌

ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా విజయారెడ్డి గురువారం నామినేషన్‌ వేయనున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఖైరతాబాద్‌ గ్రంథాలయ చౌరస్తా నుంచి ఊరేగింపుగా వెళ్లి నామినేషన్‌ సమర్పించనున్నట్లు ఆమె తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, పీజేఆర్‌ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-09T08:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising