ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Konda Murali: హీటెక్కుతున్న వరంగల్ రాజకీయం.. ఆ రెండు చెప్పాలంటూ ధర్మారెడ్డికి మురళీ సవాల్

ABN, First Publish Date - 2023-06-20T14:47:42+05:30

కాంగ్రెస్ నేత కొండా మురళీ-బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల దాడి పెంచేస్తున్నారు. నిన్నటి దాకా మాటకు మాట అనుకుంటే.. ఇప్పుడు సవాళ్ల వరకు వెళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌: కాంగ్రెస్ నేత కొండా మురళీ-బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల దాడి పెంచేస్తున్నారు. నిన్నటి దాకా మాటకు మాట అనుకుంటే.. ఇప్పుడు సవాళ్ల వరకు వెళ్లింది. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు మురళీ కౌంటర్ ఇస్తే.. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. తాజాగా ధర్మారెడ్డి వ్యాఖ్యలకు కొండా మురళీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేస్తూ సవాల్ విసిరారు. కొండా మురళీ (Konda Murali) మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...

‘‘ధర్మారెడ్డి.. డేటు.. టైము చెప్పు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా!, ఎవరిని ఎవరు తరిమి కొడతారో తేల్చుకుందాం. పార్టీ అవకాశం ఇస్తే పరకాలలో పోటీ చేస్తా. ధర్మారెడ్డి నీ అంతు తేలుస్తా. బుల్లెట్లకు ఎదురొడ్డి నిలబడ్డ కొండా మురళీ ఎప్పటికీ భయపడబోడు. నంది పైపులు అమ్ముకునే బతికే ధర్మారెడ్డి నా గురించి మాట్లాడతావా?. మహిళా ఎంపీపీని అవమానించిన ధర్మారెడ్డిది కుసంస్కారం. ధర్మారెడ్డి మట్టి దొంగ. ధర్మారెడ్డి అరాచకాలు భరించలేక ఆయన కార్యకర్తలు నా దగ్గరకు వస్తున్నారు. మైసమ్మ సాక్షిగా పరకాలలో ధర్మారెడ్డిని ఓడిస్తా. భయ పడటం అనేది మా వంశంలో లేదు. కేటీఆర్ చెబితే మీడియాతో మాట్లాడినావు. నేనేమైనా ఛత్తీస్‌గఢ్ గోండు బిడ్డనా.. నా భాష బాగోలేదట. నేను సన్నాసుల కాళ్లు మొక్క. చెంచాగిరి అనేది బీఆర్ఎస్ పార్టీలోనే పుట్టింది. నాకు రాజకీయ బిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి. అహంకారపు మాటలు మానుకోకపోతే నిన్ను తరిమికొడతాం. పరకాలలో ఉంటా.. వరంగల్ తూర్పులో ఉంటా.. దమ్ముంటే కాచుకోండి.’’ అంటూ బీఆర్ఎస్ నేతలకు కొండా మురళీ సవాల్ విసిరారు. ఇక వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కొవిడ్ సమయంలో చిన్న చిన్న దుకాణదారుల దగ్గర డబ్బులు వసూలు చేశారని మురళీ ఆరోపించారు.

Updated Date - 2023-06-20T14:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising