Jangaon MLA: ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భావోద్వేగం.. ఎందుకంటే?
ABN, First Publish Date - 2023-05-09T13:11:11+05:30
తన కూతురు తనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పందించారు.
జనగామ: తన కూతురు తనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (Jangaon MLA Muttireddy Yadagiri Reddy) స్పందించారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రత్యర్థులు కొందరు కుట్ర పన్ని తమ కుటుంబంలో చిచ్చులు పెట్టాలని చూస్తున్నారని ముత్తిరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. చేర్యాలలోని సర్వే నెంబర్ 1402లో 1200 గజాల స్థలం తన కూతురు పేరుపై రిజిస్టర్ చేసిందని.. ఇందులో ఎలాంటి పోర్జరీ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తన కూతురు పేరు మీద 125 నుంచి 150 గజాల స్థలం ఉందని...ఇందలోనూ ఎలాంటి పోర్జరీ లేదన్నారు. కిరాయి నామా దస్తావేజు తనకు తెలియకుండా తన కుమారుడు మార్చారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వెల్లడించారు.
తండ్రిపై ఫిర్యాదు...
కాగా.. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో తండ్రి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై కూతురు తుల్జాభవాని రెడ్డి ఫిర్యాదు చేశారు. సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎకరం ఇరవై గుంటలు తన పేరు మీద భూమి తీసుకున్నారని తండ్రిపై కూతురు ఫిర్యాదు చేశారు. భవాని రెడ్డి ఫిర్యాదుపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 406, 420, 463,464,468, 471, ఆర్/డబ్ల్యూ 34iపీసీ, 156(3) సీఆర్‌పీసీ ప్రకారం కేసులు నమోదు అయ్యాయి.
Updated Date - 2023-05-09T13:19:14+05:30 IST