Seetakka: వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఎమ్మెల్యే సీతక్క
ABN, First Publish Date - 2023-07-24T14:45:18+05:30
ములుగు జిల్లా: ములుగు మండలం, మల్లంపల్లిలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు ఎమ్మెల్యే సీతక్క మద్దతు తెలిపారు. రోడ్లు ఊడ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
ములుగు జిల్లా: ములుగు మండలం, మల్లంపల్లిలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు (Gram Panchayat Workers Strike) ఎమ్మెల్యే సీతక్క (MLA Seetakka) మద్దతు తెలిపారు. రోడ్లు ఊడ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రామపంచాయితీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్టిపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రాగానే గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు.
Updated Date - 2023-07-24T14:45:18+05:30 IST