ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Preethi Case : నా కూతురిది ఆత్మహత్య కాదు.. హత్యే.. తమకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదన్న ప్రీతి తండ్రి

ABN, First Publish Date - 2023-03-06T13:10:42+05:30

తన కూతురిది ఆత్మహత్య కాదని.. హత్యేనని కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ధారావత్ ప్రీతి తండ్రి నరేందర్ పేర్కొన్నారు. నేడు తెలంగాణ డీజీపీని కలవడానికి వచ్చిన నరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్ : తన కూతురిది ఆత్మహత్య కాదని.. హత్యేనని కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ధారావత్ ప్రీతి తండ్రి నరేందర్ పేర్కొన్నారు. నేడు తెలంగాణ డీజీపీని కలవడానికి వచ్చిన నరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదన్నారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి కోరాడనికి వచ్చామన్నారు. నిందితులకు సరైన శిక్ష పడేలా చూడాలని కోరుతామన్నారు. నిన్న మట్టేవాడా పోలీసులు తన ఇంటికి వచ్చి విచారించారన్నారు. ఘటనపై మరోసారి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారన్నారు. ఒకవేళ టాక్సికాలజీ వచ్చిన కాజ్ ఆఫ్ డెత్ క్లియర్ తెలియదన్నారు. టాక్సికాలజీ కోసం తీసుకున్న నమూనాలు, అప్పుడే ఎక్కించిన రక్తం నమూనాలు తీసుకున్నారు కాబట్టి సరైన రిపోర్ట్ రాదని డాక్టర్లు చెప్పారన్నారు. వరంగల్ లో ఘటన జరిగిన రోజు ఎంజీఎంలో నమూనాలు తీసుకొని ఉంటే టాక్సికాలజీ రిపోర్ట్ సరైన ఫలితం తేలేదని ప్రీతి తండ్రి నరేందర్ పేర్కొన్నారు.

కాగా.. ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఎంజీఎం ఆస్పత్రిలో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నచోట.. మిడాజోలం, పెంటానోల్‌ అనే మత్తు ఇంజెక్షన్‌ వయల్స్‌ పడి ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె శరీరంలో ఆ మందుల అవశేషాలతో పాటు, వేరేవైనా విషాలు ఉన్నాయా తెలుసుకునేందుకు హైదరాబాద్‌ డాక్టర్లు నమూనాలు సేకరించి టాక్సికాలజీ పరీక్షకు పంపారు. పదిరోజుల తర్వాత.. ఆ నివేదిక ఆదివారం వరంగల్‌ పోలీసులకు చేరింది. ప్రీతి శరీరం నుంచి సేకరించిన నమూనాల్లో ఎలాంటి రసాయనాలూ కనిపించలేదని ఆ నివేదిక పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? అనే విషయంలో ఎలాంటి నిర్ధారణకూ రాలేని పరిస్థితి. ఆమె తల్లిదండ్రులేమో.. తమ కుమార్తె హత్యకు గురైందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా మార్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్‌ ఫోన్‌ కాల్‌డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Updated Date - 2023-03-06T13:10:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising