Revanth Reddy: యూత్ లీడర్ పవన్‌ను చంపాలని చూశారు...
ABN, First Publish Date - 2023-02-21T14:13:42+05:30
హనుమకొండ: భూ కబ్జాదారుడు, రౌడీ కార్యక్రమాలకు సూత్రధారి పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ (MLA Vinay Baskar) అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.
హనుమకొండ: భూ కబ్జాదారుడు, రౌడీ కార్యక్రమాలకు సూత్రధారి పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ (MLA Vinay Baskar) అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. మంగళవారం పాదయాత్ర (Padayatra) చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న తన పాదయాత్రకు వచ్చిన యూత్ లీడర్ పవన్ (Pawan)పై దాడి చేయడం హేయమైన చర్య అని, వినయ్ భాస్కర్ మనుషులు ఆయనను చంపాలని చూశారని ఆరోపించారు. వరంగల్‌లో దాడులు నిత్యకృత్యం అయ్యాయని విమర్శించారు. చైతన్య వంతమైన ఈ గడ్డపైన ఇలాంటి దాడులు జరగడం దారుణమన్నారు. వినర్ భాస్కర్ అనుచరులు గంజాయి మత్తు (Marijuana intoxication)లో దాడి చేశారని, కమిషనర్ కూడా రాజకీయ ఒత్తిళ్లతో సరిగా పనిచేయలోకపోతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ యూత్ లీడర్ పవన్‌ను ఎమ్మెల్యే వినయ్ భాస్కరే చంపాలని అనుచరులకు ఆదేశించారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు పెట్టి.. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడులు చేసింది ఎవరో తెలిసినా ఇప్పటి వరకూ నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదని మండిపడ్డారు. దాడి దృశ్యాలు చిత్రీకరించి తమ వాళ్లకు పంపి బెదిస్తున్నారని, దాడిపై వరంగల్ సీపీని కలుస్తానని చెప్పారు. రాష్ట్ర డీజీపీ ఇక్కడికి రావాలన్నారు. ఈ ఘటనకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపిచ్చారు.
కాగా హనుమకొండలో హై టెన్షన్ (High tension) నెలకొంది. నిన్న రాత్రి టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ (Corner Meeting) ముగియగానే యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్
పై హత్యాయత్నం జరిగింది. బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు పవన్‌ను ఓ గల్లీలోకి తీసుకువెళ్లి విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడి.. రక్తపు మడుగులో పడి ఉన్న పవన్‌ను ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సీసీ కెమెరాలో రికార్డు అయిన దాడి దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పవన్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రస్తుతం పవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయం వద్ద భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.
Updated Date - 2023-02-21T14:13:45+05:30 IST