Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కొత్త తలనొప్పి
ABN, First Publish Date - 2023-03-27T14:46:22+05:30
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయాలు రచ్చకెక్కాయి.
వరంగల్: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congrss) లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ (Congress)లో రాజకీయాలు రచ్చకెక్కాయి. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి (Janagama DCC President Janga Raghavareddy)ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ హనుమకొండ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి (Hanumakonda DCC president Naini Rajender Reddy) లేఖ విడుదల చేశారు. జంగా రాఘవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానానికి లేఖ పంపారు. జంగారాఘవరెడ్డి సస్పెన్షన్‌ను పార్టీ ఆమోదించకపోతే కీలక నిర్ణయం తీసుకుంటామని నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఘవరెడ్డిపై అధిష్టానానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాయిని వెల్లడించారు.
జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్ నుంచి వరంగల్ పశ్చిమ టికెట్‌ను ఆశిస్తున్నారు. మరోవైపు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కూడా ఇదే టికెట్‌ను కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఇద్దరు కూడా బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. నాయిని రాజేందర్ ఒకడుగు ముందుకు వేసి ఏకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) పాదయాత్ర సభలోనే ప్రకటించుకున్నారు. అయితే ఈ మధ్య హనుమకొండ జిల్లాలోని కాజేపేటలోని డివిజన్లలో జంగా రాఘవరెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. అయితే తన అనుమతి లేకుండా, పార్టీ అనుమతి లేకుండా ఎలా పాదయాత్ర చేస్తారని నాయిని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ పశ్చిమ టికెట్ తనదే అని అందుకు నాయిని మద్దతు కూడా ఉందంటూ జంగా రాఘవరెడ్డి ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలపై నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జంగారాఘవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీకి లేఖ రాశారు. దీన్ని టీపీసీసీ ఆమోదిస్తుందని భావిస్తున్నానని లేని పక్షంలో కీలక నిర్ణయం తీసుకుంటానని నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.
నాయిని వ్యాఖ్యలపై జంగా రాఘవరెడ్డి ఈరోజు 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం అందించారు. జంగారాఘవరెడ్డి మీడియా సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Updated Date - 2023-03-27T14:46:22+05:30 IST