ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Sharmila: ‘దాడులకు భయపడను... ఆ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుంటే మంచిది’

ABN, First Publish Date - 2023-02-04T11:10:42+05:30

బీఆర్‌ఎస్ నేతలపై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: బీఆర్‌ఎస్ నేతల (BRS Leaders)పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై, మీడియాపై కూడా బీఆర్ఎస్ నేతలు దాడి చేశారన్నారు. నిజాలను చెబితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అక్రమాలకు పాల్పడం లేదా, ఆయన ఏ1 కాంట్రాక్టర్ కాదా అని ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్‌నే కోడ్ చేసినట్లు తెలిపారు. ‘‘మీరు నిజాయితీపరులైతో పబ్లిక్ ఫోరం మీటింగ్ పెట్టండి... అక్కడ ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి’’ అంటూ సవాల్ విసిరారు. ప్రజల పక్షాన పోరాడటమే తమ తప్పా అంటూ నిలదీశారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తనపై దాడులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో హామీలు ఇచ్చి, ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని వైఎస్సార్టీపీ అధినేత్రి విమర్శించారు.

రైతులపై ఎమ్మెల్యే ఆరూరి రమేష్ థర్డ్ డిగ్రీ చేపించింది నిజం కాదా అని నిలదీశారు. కబ్జాలు చేయడం నిజం కాదా, ఏకంగా మందకృష్ణ భూమినే కబ్జా చేశారు కదా అని అన్నారు. ప్రజా సేవ చేయాలనే సోయి బీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదన్నారు. పర్వతగిరి నుంచి మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి ఆ గ్రామానికి ఏం చేశారని ప్రశ్నించానన్నారు. అప్పులపాలై సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఈ విషయంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. సర్పంచులకు నిధులు అందించాల్సింది పోయి ఖాళీ బీరు సీసాలు అమ్మమంటారా అని మండిపడ్డారు. ఎవరు మాట్లాడితే వాళ్లపై దాడులు, కేసులు పెడుతున్నారన్నారు. ‘‘బెదిరింపులకు, దాడులకు వైఎస్ షర్మిల భయపడదు. మీ దాడులకు రెట్టింపు స్థాయిలో మీ అవినీతిని ప్రశ్నిస్తాం. నిన్న జరిగిన దాడిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీ లాంటి జేజమ్మలని ఎంతో మందిని చూశారు. బీఆర్ఎస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోండి’’ అంటూ హెచ్చరించారు. సెక్రటేరియట్‌లో ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసిన షర్మిల.. మాక్ డ్రిల్ జరిగితే ప్రతిపక్షాలను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు.

Updated Date - 2023-02-04T11:11:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising